FACE క్లబ్ ఆధ్వర్యంలో నాటిక

FACE క్లబ్ ఆధ్వర్యంలో సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి జీవితంపై అర్థవంతమైన నాటిక

FACE క్లబ్ ఆధ్వర్యంలో సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి జీవితంపై అర్థవంతమైన నాటిక 

FACE (Francis Association for Christian Endeavours) క్లబ్, సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి పండుగను పురస్కరించుకుని, ఆయన పవిత్ర జీవితం, విశ్వాసం, సేవాభావం మరియు ప్రకృతి పట్ల ప్రేమను ప్రతిబింబించే ఒక సందేశాత్మక నాటికను ప్రదర్శించింది. ఈ కార్యక్రమం బేగంపేట లోని  సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ విమెన్ (St. Francis College for Women) లో జరిగింది. 

కళాశాల విద్యార్థులు ఈ నాటిక ద్వారా పునీత ఫ్రాన్సిస్ వారి  జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఆయన జీవితంలో చోటుచేసుకున్న మార్పు, దేవునిపై అచంచలమైన విశ్వాసం, పేదల పట్ల కరుణ, సమాజ సేవ పట్ల అంకితభావం వంటి విలువలను ఈ ప్రదర్శన చక్కగా తెలియజేసింది.

పక్షులు, జంతువులు, చెట్లు, పర్యావరణం పట్ల ఆయన చూపిన ప్రేమ ద్వారా సృష్టిని గౌరవించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని అందించారు.

FACE క్లబ్ సభ్యులు తమ నటన, సంభాషణలు మరియు భావవ్యక్తీకరణ ద్వారా సెయింట్ ఫ్రాన్సిస్ జీవితం అందించిన ఆధ్యాత్మిక, నైతిక సందేశాలను ప్రేక్షకులకు చేరవేశారు.

Article and Design By M Kranthi Swaroop

Telugu Survey Popup Image