క్రిస్మస్ వేడుకలకు వాటికన్ ముస్తాబవుతోంది!
క్రిస్మస్ వేడుకలకు వాటికన్ ముస్తాబవుతోంది!
వాటికన్లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్కు 2026 క్రిస్మస్ వేడుకల కోసం భారీ క్రిస్మస్ చెట్టు చేరుకుంది. ఇది 24 మీటర్ల ఎత్తు మరియు 7.5 మెట్రిక్ టన్నుల బరువు ఉంటుంది. దీనిని నవంబర్ 20, శుక్రవారం నాడు సెయింట్ పీటర్స్ స్క్వేర్లో ఏర్పాటు చేశారు.
ఈ ఏడాది సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీసీ 800వ వర్ధంతి సందర్భంగా ఇటలీలోని గుబ్బియో పట్టణంలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రిస్మస్ చెట్టు దీపాలంకరణతో పాటూ వాటికన్ క్రిస్మస్ వేడుకల దీపాలంకరణ కార్యక్రమం కూడా ఒకేసారి జరగనుంది.
సెయింట్ పీటర్స్ బసిలికా ముందు ఏసు జనన దృశ్యం కోసం సన్నాహాలు కొనసాగుతుండగా, వాటికన్ క్రిస్మస్ చెట్టుగా ఉపయోగపడే దక్షిణ ఇటలీకి చెందిన సిల్వర్ ఫిర్ చెట్టు సెయింట్ పీటర్స్ స్క్వేర్కు చేరుకుంది.50,000కు పైగా LED దీపాలతో చెట్టును అలంకరించనున్నారు.ఇటలీలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారులు తయారుచేసిన అలంకరణలను చెట్టుకు ఉపయోగించనున్నారు .
డిసెంబర్ 7న రోమ్ కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 గంటలకు చిన్నారులు క్రిస్మస్ దీపాలను వెలిగించనున్నారు.యేసుక్రీస్తు జనన ఘట్టాన్ని ప్రతిబింబించే ప్రత్యేకమైన తొట్టెల అమరికను కూడా సెయింట్ పీటర్స్ బసిలికా ముందు ఏర్పాటు చేస్తున్నారు.క్రిస్మస్ అనంతరం చెట్టు కలపను సామాజిక, కళాత్మక, ప్రార్థనా సంబంధమైన అవసరాలకు ఉపయోగించనున్నారు.
Article and design by M kranthi Swaroop
