పోప్ ఫ్రాన్సిస్ వ్యక్తిగత డైరీలో సంచలన విషయాలు
పోప్ ఫ్రాన్సిస్ వ్యక్తిగత డైరీలో సంచలన విషయాలు
నవంబర్ 24,2026న దివంగత పోప్ ఫ్రాన్సిస్ గారి వ్యక్తిగత డైరీలోని కొన్ని భాగాలు పుస్తక రూపం("ద ప్రైవేట్ డైరీ ఆఫ్ పోప్ ఫ్రాన్సిస్" )లో ప్రచురితమయ్యాయి. 1992 నుంచి 2024 ఆగస్టు వరకు ఆయన రాసుకున్న వ్యక్తిగత ఆలోచనలు ఇందులో ఉన్నాయి.ఈ డైరీని కార్డినల్ విక్టర్ మాన్యుయెల్ ఫెర్నాండెజ్ సంపాదకత్వంలో పుస్తకంగా రూపొందించారు.
ప్రపంచానికి తెలియని తన భయాలు, అభద్రత భావాలు, ఆధ్యాత్మిక
సంఘర్షణలను దివంగత పోప్ ఫ్రాన్సిస్ గారు ఇందులో నిజాయితీగా పంచుకున్నారు. ముఖ్యంగా 2018 లో చిలీ పర్యటన సందర్భంగా దేవాలయాలలో జరిగిన గురువుల లైంగిక వేధింపుల వ్యవహారంపై తీవ్ర వేదనకు గురయ్యారు.ఈ కుంభకోణం శ్రీసభ కి ఎంతో అవమానాన్ని ఆవేదన తెచ్చిపెట్టిందని ఇందులో తాను నరక ద్వారాలను చూశనని ఆయన వ్యక్తం చేశారు. అలాగే తన జీవితంలో మూడు సార్లు సైతానును తలపించే భయానక దర్శనాలు కలిగాయని అందులో పేర్కొన్నారు.
తనకున్న సర్వాధికారాలతో తానే దేవుడినన్నట్లుగా వ్యవహరించాలనే ప్రలోభానికి గురయ్యానని, అయితే చివరకు దేవుని కరుణకు పూర్తిగా లొంగిపోవడం ద్వారా ఆ సంక్షోభం నుంచి బయటపడ్డానని ఆయన వివరించారు.
తన అత్యంత రహస్య ఆలోచనలను పోప్ ఎవరికీ అర్థం కాని కోడు భాషలో రాశారని వాటిని పుస్తకంలో చేర్చలేదని ఫెర్నాండేస్ తెలిపారు.
2024 ఆగస్టు 18న ఉక్రెయిన్, మధ్యప్రాచ్యం, మయన్మార్‌తో పాటు యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో శాంతి నెలకొనాలని ప్రార్థిస్తూ ఆయన రాసిన వాక్యాలే పోప్ ఫ్రాన్సిస్ వ్యక్తిగత డైరీలోని చివరి నమోదు.ఆ తర్వాత సుమారు ఎనిమిది నెలలకు, 2025 ఏప్రిల్ 21న ఆయన కన్నుమూశారు.
Article and Design BY M KRANTHI SWAROOP
