బాంబు దాడులకు గురైన దక్షిణ గ్రామాలను సందర్శించిన లెబనాన్‌ అపోస్టోలిక్ నన్సియో

మార్చి 16న బీరూట్ నుండి లెబనాన్ దక్షిణ ప్రాంతానికి, దేవదారు వృక్షాల భూమిని ఇజ్రాయెల్ నుండి వేరుచేసే సరిహద్దు అయిన బ్లూ లైన్ వరకు లెబనాన్ అపోస్టోలిక్ నన్సియో, అగ్రపీఠాధిపతులు మహా పూజ్య పాలో బోర్జియా పర్యటించారు.

తన ప్రయాణంలో తాను చూసిన విధ్వంసకర దృశ్యాలను చూసి చాలించి పోయారు.ఈ పర్యటన మానవతా సహాయాన్ని అందించడంతో పాటు, "సాన్నిహిత్యం, శాంతి మరియు ఆశ సందేశాన్ని" ఇవ్వడమే అని అయన తెలిపారు. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే పోప్ ప్రతినిధి క్రైస్తవ, ముస్లిం లేదా మిశ్రమ జనాభా ఉన్న గ్రామాలను సందర్శించడం ఇది రెండవసారి. ఈ పట్టణాలు ప్రస్తుతం ఇజ్రాయెల్ మరియు హిజ్బుల్లా మధ్య జరుగుతున్న కాల్పుల మధ్య చిక్కుకుని వున్నాయి.

ఈ మిషన్‌లో భాగంగా ఆర్చ్‌బిషప్ బోర్జియా రమీష్, డెబెల్ మరియు ఐన్ ఎబెల్‌లకు ప్రయాణించారు, అక్కడ కారిటాస్ కు చెందిన మానవతా సహాయక బృందం వివిధ సామాగ్రి మరియు మందులను తీసుకువెళ్తున్న ఆరు ట్రక్కులతో చేరుకుంది. గత వారం మార్చి 13న చేసినట్లే, బాంబులు మరియు భయంతో అలసిపోయిన ఈ ప్రజల కోసం నన్సియో స్వయంగా పెట్టెలు మరియు సంచులను దించి వారికీ అందించారు . ప్రయాణంలోని ప్రతి మజిలీలోనూ నన్సియో “శాంతి సందేశాన్ని” కూడా అందించారు.

 

Article and Design By M. Kranthi Swaroop