ఫ్రాన్స్‌లో పోప్ లియో XIV: తొలి రోజే కీలక సందేశాలు!
ఫ్రాన్స్‌లో పోప్ లియో XIV: తొలి రోజే కీలక సందేశాలు!
పరిశుద్ధ లియో XIV పాపు గారు ఫ్రాన్స్‌లో తన నాలుగు రోజుల అపోస్టలిక్ పర్యటనను సెప్టెంబర్ 25, 2026న ప్రారంభించారు. ఇది 2008లో పోప్ బెనెడిక్ట్ XVI పర్యటన తర్వాత ఫ్రాన్స్‌కు జరిగిన మొదటి అధికారిక పాపల్ పర్యటన.
పరిశుద్ధ లియో XIV పాపు గారు రోమ్ నుంచి ITA Airways A321 విమానంలో బయలుదేరి, ఉదయం 9:56 గంటలకు పారిస్ ఓర్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్ గారు ఆయనకు అధికారిక స్వాగతం పలికారు.
ఎలీసీ ప్యాలెస్‌లో అధ్యక్షుడు మాక్రోన్‌తో పరిశుద్ధ లియో XIV పాపు గారు సమావేశమయ్యారు. అనంతరం అధికారులు, పౌర సమాజ ప్రతినిధులు, దౌత్యవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
పరిశుద్ధ లియో XIV పాపు గారు తన ప్రసంగంలో మానవ గౌరవం, మానవ హక్కులు, మత స్వేచ్ఛ, శాంతి, సోదరభావం వంటి అంశాలను ప్రస్తావించారు. అలాగే ఫ్రాన్స్‌కు ఉన్న క్రైస్తవ చారిత్రక వారసత్వాన్ని గుర్తుచేశారు.ప్రపంచంలో శాంతిని నెలకొల్పడంలో, దేశాల మధ్య సంభాషణను ప్రోత్సహించడంలో, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంలో ఫ్రాన్స్ కీలక పాత్ర పోషించాలని పరిశుద్ధ లియో XIV పాపు గారు పిలుపునిచ్చారు.
సాయంత్రం పరిశుద్ధ లియో XIV పాపు గారు నోట్ర్-డామ్ డి పారిస్ కేథడ్రల్‌లో ప్రార్థనలు చేసారు. 2019లో అగ్నిప్రమాదానికి గురైన ఈ చారిత్రక కేథడ్రల్ పునర్నిర్మాణాన్ని ప్రస్తావిస్తూ, నోట్ర్-డామ్ కేవలం ఒక భవనం కాదని, ప్రజల విశ్వాసం మరియు సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని అయన అన్నారు.
రోజు చివరగా సెంట్-డెనిస్‌లోని Stade de Franceలో వేలాది మంది యువతతో ప్రార్థనా జాగరణలో పరిశుద్ధ లియో XIV పాపు గారు పాల్గొన్నారు. యువతకు విశ్వాసం, ఆశ మరియు క్రీస్తుతో సంబంధం గురించి సందేశం ఇచ్చారు.
Article and Design By M Kranthi Swaroop
