గాజాకు పోప్ ఫ్రాన్సిస్ చివరి బహుమతి

గాజాకు పోప్ ఫ్రాన్సిస్ చివరి బహుమతి
పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి వాహనం(పోప్‌మొబైల్) గాజా లోని పిల్లల కోసం మొబైల్ హెల్త్ యూనిట్‌గా రూపాంతరం చెందుతోంది. గాజా పిల్లలకు మొబైల్ ఆరోగ్య క్లినిక్‌గా మార్చాలని పోప్ ఫ్రాన్సిస్ అభ్యర్థించారు.
తన చివరి నెలల్లో, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఈ పనిని కారిటాస్ జెరూసలేంకు అప్పగించారు. ఇప్పుడు పోప్‌మొబైల్‌ను హెల్త్ క్లినిక్‌గా మార్చడానికి కారిటాస్ సిబ్బంది కృషి చేస్తున్నారు.
పునర్నిర్మించిన పోప్‌మొబైల్‌లో రోగ నిర్ధారణ, పరీక్ష మరియు చికిత్స కోసం పరికరాలు అమర్చబడుతున్నాయి - వీటిలో ఇన్ఫెక్షన్లకు వేగవంతమైన పరీక్షలు, రోగనిర్ధారణ పరికరాలు, టీకాలు, అత్యవసర కిట్‌లు మరియు ఇతర ప్రాణాలను రక్షించే సామాగ్రి ఉన్నాయి. ఇది వైద్యులు మరియు ఆరోగ్య సిబ్బందిని కలిగి ఉంటుంది.
క్లిష్ట పరిస్థితుల్లో గాజా లోని చాలా కాలంగా సేవలందిస్తున్న కారిటాస్ జెరూసలేం, ఈ క్షేత్ర ప్రయత్నానికి నాయకత్వం వహిస్తోంది. ఆరోగ్య సంరక్షణ సేవలకు కట్టుబడి ఉన్న వంద మందికి పైగా సిబ్బందితో తన సహాయ సహకారాలను అందిస్తుంది.
గాజాలో దాదాపు పది లక్షల మంది పిల్లలు నిరాశ్రయులయ్యారు. భయంకరమైన యుద్ధం, కుప్పకూలిన మౌలిక సదుపాయాలు, దెబ్బతిన్న ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మరియు విద్య లేకపోవడం, ఆకలి, ఇన్ఫెక్షన్లు వల్ల వారి పరిస్థితులు ప్రమాదంలో పడిపోయాయి.
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer