దేవుని ప్రజలను నడిపించిన కాపరి: కార్డినల్ రుయినీ సేవలను స్మరించుకున్న పోప్ లియో XIV

దేవుని ప్రజలను నడిపించిన కాపరి: కార్డినల్ రుయినీ సేవలను స్మరించుకున్న పోప్ లియో XIV

జూన్ 16, మంగళవారం రాత్రి మహా పూజ్య కార్డినల్ కామిల్లో రూయిని గారు  మరణించిన రెండు రోజుల తర్వాత, జూన్ 18న సెయింట్ పీటర్స్ బసిలికాలోని 'ఆల్టార్ ఆఫ్ ది చైర్' వద్ద అంత్యక్రియల కార్యక్రమం జరిగింది. 

 పరిశుద్ధ లియో XIV పాపు గారు గురువారం కార్డినల్ కామిల్లో రుయిని గారి అంత్యక్రియలకు అధ్యక్షత వహించి , ఆయనను "దేవుని ప్రజలకు ఎలా మార్గనిర్దేశం చేయాలో తెలిసిన"శ్రీసభసేవకుడిగాస్మరించుకున్నారు.ఇటాలియన్ శ్రీసభ లోని అత్యంత ప్రముఖులలో ఒకరైన ఆయనకు వీడ్కోలు పలకడానికి పలువురు కార్డినల్స్, ఆర్చ్‌బిషప్‌లు మరియు బిషప్‌లు హాజరయ్యారు. 

 పరిశుద్ధ లియో XIV పాపు గారు కార్డినల్ మహా పూజ్య కామిల్లో రుయిని గారి  సుదీర్ఘమైన మరియు ప్రభావవంతమైన శ్రీసభ  సేవను గుర్తుచేసుకుంటూ, ముఖ్యంగా "శ్రీసభ  సమాజ ప్రస్థానంపై మరియు పౌర సమాజంపై కూడా ప్రగాఢమైన ముద్ర వేసిన" కార్యక్రమాలను ప్రస్తావించారు. 

వాటిలో, కార్డినల్ మహా పూజ్య కామిల్లో రుయిని గారి “సాంస్కృతిక ప్రాజెక్ట్,” ఇటాలియన్ మత, పౌర మరియు రాజకీయ జీవితంలో కాథలిక్కుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు, రోమ్‌లోని డయోసిసన్ సినోడ్ మరియు దాని అమలు, ఇంకా “శ్రీసభ  జీవితంలోని వివిధ స్థాయిలలో, అలాగే లౌకిక ప్రపంచం మరియు సమాజంలో ఆయన చురుకైన మరియు సంభాషణాత్మక ఉనికి” వంటివాటిని పరిశుద్ధ లియో XIV పాపు గారు ఉదహరించారు. 

1931 ఫిబ్రవరి 19న మోడెనా ప్రావిన్స్‌లోని సస్సోలోలో జన్మించిన మహా పూజ్య కామిల్లో రుయిని గారు ఒక స్థానిక వైద్యుని కుమారుడు. 

 1991నుండి 2008 వరకు రోమ్ యొక్క కార్డినల్ వికార్‌గా మరియు 1991 నుండి 2007 వరకు ఇటాలియన్ బిషప్స్ కాన్ఫరెన్స్ (CEI) అధ్యక్షుడిగా పనిచేశారు.అతను పోప్ జాన్ పాల్ II కు అత్యంత సన్నిహితుడు మరియు  ప్రధాన వ్యూహకర్త . అలాగే పోప్ బెనెడిక్ట్ XVI కు కూడా అత్యంత నమ్మకమైన సలహాదారుగా వ్యవహరించారు.

ఆధునిక సమాజంలో లౌకికవాదం (secularism) పై గట్టిగా పోరాడిన వారిలో అతను ఒకరు. ఇటలీలో కృత్రిమ గర్భధారణ (artificial insemination) కు వ్యతిరేకంగా జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో చర్చి తరపున కీలక పాత్ర పోషించారు.95 ఏళ్ల వయస్సులో జూన్ 16, 2026 న రోమ్‌లో మరణించారు.

Article and Design BY M Kranthi Swaroop