ఈస్టర్ పర్వదినాన జెరూసలేము నగరం నిశ్శబ్దంలో మునిగిపోయింది

ఈస్టర్ పర్వదినాన జెరూసలేము నగరం నిశ్శబ్దంలో మునిగిపోయింది

సాధారణంగా సందడిగా ఉండే జెరూసలేం పాత నగరపు సందులలో, ఈస్టర్ ఆదివారం నాడు నిశ్శబ్దం రాజ్యమేలింది. “యుద్ధ ఉద్రిక్తతల మధ్య, క్రీస్తు శిలువ వేయబడటం మరియు పునరుత్థానానికి ప్రతీకగా భావించే ప్రభు యేసుని పవిత్ర సమాధి ఆలయ ప్రవేశంపై ఆంక్షలు విధించడంతో పండుగ ఉత్సాహం మసకబారింది. 

క్రైస్తవులు ప్రభు యేసుక్రీస్తును శిలువ వేసి, సమాధి చేసి, మృతుల నుండి తిరిగి లేచాడని విశ్వసించే ఆ దేవాలయానికి  వెళ్లే మార్గాలలో పోలీస్ చెక్‌పోస్టులను ఏర్పరు చేసారు.  చెక్‌పోస్టుల వద్ద ఉన్న పోలీసులు, ఆ ప్రదేశానికి సమీపంలోకి అనుమతించబడిన కొద్దిమంది భక్తులను తనిఖీ చేసి లోనికి పంపించారు. ఆ ప్రాంతంలోని దుకాణాలన్నీ మూసివేయడంతో, అక్కడ నిర్మానుష్య భావన మరింత పెరిగింది. ఈ సారి మాత్రం  జనసమూహానికి పూర్తి భిన్నంగా, అతి కొద్ది మంది సమక్షంలో, తలుపులు మూసివేసి వేడుకలు జరిగాయి.

తెల్లవారుజామున"ఈస్టర్ శుభాకాంక్షలు," తెలుపుతూ  మహా పూజ్య కార్డినల్ పియర్‌బట్టిస్టా పిజ్జాబల్లా గారు మరి  కొద్దిమంది మతగురువులతో కలిసి దేవాలయములోనికి లోకి ప్రవేశించారని అక్కడఉన్నవారు  తెలిపారు.

బయట, కొందరు క్యాథలిక్కులు మరియు ఆర్థడాక్స్ క్రైస్తవులు దేవాలయం లోనికి చేరుకోవడానికి ప్రయత్నించారు, కానీ భద్రతా దళాలు వారిని దూరంగా ఉంచాయి.

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధంలో నిరంతరం దాడుల ముప్పు ఉన్నందున, భద్రతా చర్యగా ఇజ్రాయెల్ పెద్ద సమావేశాలపై కూడా ఆంక్షలు విధించింది. యూదులు, క్రైస్తవులు మరియు ముస్లింలకు పవిత్రమైన ప్రదేశాలకు నిలయమైన, విలీనం చేయబడిన తూర్పు జెరూసలేంలోని పాత నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

మనకు తెలిసినంత చరిత్రలో మొట్టమొదటిసారిగా, జెరూసలేంలోని 'చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్చర్'లో ఈస్టర్ పండుగ మూసిన తలుపుల వెనుక జరుపుకోబడింది.

 

Article and Design By M kranthi Swaroop