ఆల్ప్స్ పునీత బెర్నార్డ్ ప్రతినిధులతో సమావేశమైన పొప్ ఫ్రాన్సిస్
పొప్ ఫ్రాన్సిస్ నవంబర్ 11వ తేదీ సోమవారం నాడు ఆస్టా మేత్రాసనం మరియు కానన్స్ రెగ్యులర్ ఆఫ్ గ్రేట్ సెయింట్ బెర్నార్డ్ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఉత్తర ఇటలీలోని పర్వత ప్రాంతంలో శాంతి మరియు సామరస్యాన్ని ప్రకటించడానికి తన జీవితాన్ని అంకితం చేసారు పునీత బెర్నార్డ్ ఆఫ్ అయోస్టా.
వీరు పర్వతారోహకులు, ప్రయాణికులు మరియు ఆల్ప్స్లో నివసించే వారందరికీ పోషక పునీతులు
బెర్నార్డ్ గారు పునీత పట్టం పొంది 900వ సంవత్సరాలు , అలాగే ఆయన 1000వ జన్మదిన వార్షికోత్సవాన్ని గుర్తుచేసే జూబ్లీ సంవత్సరపు ముగింపుగా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారితో సమావేశమయ్యారు.
పోప్ 7 వ గ్రెగొరీ కి వ్యతిరేకంగా చక్రవర్తి హెన్రీ IV ని అడ్డుకోడానికి, అతను అనారోగ్యంతో బలహీనపడిన సమయంలో శాంతి కోసం పావియాకు పునీత బెర్నార్డ్ గారి ప్రయాణాన్ని గుర్తుచేస్తూ ఆయన లక్ష్యం విఫలమైనా వారి ప్రయత్నానికి తన జీవితాన్ని అర్పించారు, అతను తిరిగి వచ్చిన కొద్దిసేపటికే మరణించాడు.
"విఫలమైనప్పటికీ కూడా నిరుత్సాహపడకుండా శాంతిని నెలకొల్పాలి అనుకోవడం మనకు గతంలో కంటే ఇప్పుడు మరింత అవసరం" అని పొప్ గారు ముగించారు.