బాటా జైలును సందర్శించిన పోప్ లియో
2026 సంవత్సరంలో ఉత్తర మరియు మధ్య ఆఫ్రికా అపోస్టోలిక్ యాత్రలో భాగంగా పోప్ ఒక జైలును సందర్శించడం ఇదే మొదటిసారి.
ఈక్వటోరియల్ గినియాలోని బాటా జైలుగా పిలువబడే ఈ కారాగారంలో 650 మంది ఖైదీలు ఉన్నారు.
పోప్ పర్యటన సందర్భంగా, ఖైదీలు నృత్యాలు, పాటలతో ఆయనకు స్వాగతం పలికారు.
ఇది అక్కడి వాతావరణానికి, అలాగే ఆ జైలుకు ఉన్న పేరుకు విరుద్ధంగా, ఎంతో ఆనందంగా కనిపించింది. ఎందుకంటే, ఆ జైలు చాలా సంవత్సరాలుగా దేశంలోనే అత్యంత కఠినమైన జైళ్లలో ఒకటిగా పరిగణించబడుతోంది.
"మీరు ఒంటరివారు కాదు. మీ కుటుంబాలు మిమ్మల్ని ప్రేమిస్తున్నాయి మరియు మీ కోసం ఎదురుచూస్తున్నాయి, మరియు ఈ గోడల అవతల చాలా మంది మీ కోసం ప్రార్థిస్తున్నారు పోప్ అన్నారు
కొందరు తమను అందరూ విడిచిపెడతారేమోనని భయపడవచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు, మరియు శ్రీసభ మీకు అండగా నిలుస్తుంది అని పోప్ అన్నారు
వైఫల్యాలు ఎదురైనప్పుడు నిరాశ చెందవద్దని ప్రార్థిస్తూ, వారికి ప్రోత్సాహ సందేశాన్ని అందించారు:
సాధారణంగా కష్టమైన మరియు సంక్లిష్టమైన పరిస్థితుల ఫలితంగా జరిగే తప్పుల వల్ల మాత్రమే జీవితం నిర్వచించబడదు ఒక నూతన వ్యక్తిగా మారడం ఎల్లప్పుడూ సాధ్యమే.
పోప్ బయలుదేరే ముందు, పోప్ లియో ఖైదీలకు అస్సిసిపురి ఫ్రాన్సిస్ స్వరూపాన్ని వారికి బహూకరించారు.