కొరియా అధ్యక్షుడితో సమావేశమైన పోప్ లియో

సోమవారం జూన్ 15 ఉదయం వాటికన్‌లోని అపోస్టోలిక్ ప్యాలెస్‌లో కొరియా గణతంత్ర రాజ్య అధ్యక్షుడు Lee Jae-myung పోప్ లియోతో సమావేశమయ్యారు.

అనంతరం ఆయన ఇరు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాలపై చర్చించేందుకు 'కార్డినల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్'తో పియట్రో పరోలిన్ మరియు 'రాష్ట్రాల మరియు అంతర్జాతీయ సంస్థలతో సంబంధాల కార్యదర్శి' ఆర్చ్‌బిషప్ పాల్ రిచర్డ్ గల్లాగర్‌లతో కూడా సమావేశమయ్యారు.

సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్‌లో జరిగిన ఈ సమావేశంలో, 1963లో (అంటే 63 ఏళ్ల క్రితం) ఏర్పడిన 'హోలీ సీ' (Holy See) మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా మధ్య ఉన్న సత్సంబంధాల గురించి వారు చర్చించారు. 

అప్పటి నుండి రెండు దేశాలు సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నాయి;

రెండవ సెయింట్ జాన్ పాల్రెం పోప్ రెండుసార్లు  (1984 మరియు 1989లో) ఆ దేశాన్ని సందర్శించగా, పోప్ ఫ్రాన్సిస్ 2014లో 6వ ఆసియా యువజన దినోత్సవం సందర్భంగా అక్కడ పర్యటించారు.

'హోలీ సీ' ప్రెస్ ఆఫీస్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, కార్డినల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షుడు, "స్థానిక శ్రీసభ కొరియన్ సమాజానికి, ముఖ్యంగా విద్య మరియు సామాజిక సంక్షేమ రంగాలలో అందించిన సానుకూల సహకారం" గురించి కూడా చర్చించారు.

అలాగే, 2027లో జరగనున్న ప్రపంచ యువజన దినోత్సవం మరియు "ప్రాంతీయ, అంతర్జాతీయ పరిస్థితులకు సంబంధించిన కొన్ని అంశాల"పై కూడా చర్చలు జరిగాయి.