ఇటలీలోని రిమిని నగరాన్ని సందర్శించిన పోప్
సాన్ మారినో పర్యటన అనంతరం పోప్ లియో ఇటలీలోని రిమిని నగరాన్ని చేరుకున్నారు.
కమ్యూనియన్ అండ్ లిబరేషన్ మూవ్మెంట్ ప్రతిఏటా నిర్వహించే అంతర్జాతీయ సమావేశంలో పోప్ పాల్గొన్నారు.
1982లో రెండవ జాన్ పాల్ పోప్ పర్యటన తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఓ పోప్ ఈ నగరానికి రావడం ఇదే తొలిసారి.
సమావేశంలో భాగంగా సెంట్ అగస్టీన్ ప్రదర్శనను సందర్శించిన అనంతరం, 5,000 మంది ప్రతినిధులను ఉద్దేశించి పోప్ మాట్లాడారు.
మానవ సంబంధాలు, శాంతి ప్రాధాన్యతను వివరిస్తూ—సరిహద్దులు, చట్టాలు, వ్యవస్థల కంటే మనుషులే అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
అహంకారం, స్వార్థ లాభాపేక్ష, అధికార దుర్వినియోగం లేని సమాజ నిర్మాణం కోసం పిలుపునిచ్చారు.
పేదరికం, యుద్ధాలు, పర్యావరణ విపత్తులకు కారణమవుతున్న అన్యాయమైన వ్యవస్థలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
ఆ తర్వాత రిమిని హార్బర్లో దివ్యబలి పూజను సమర్పించిన పోప్ కేవలం వినోదం, కాలక్షేపం పేరిట పొందే తాత్కాలిక సంతోషాలు జీవితంలో శూన్యాన్ని మాత్రమే మిగులుస్తాయని హెచ్చరించారు.
