సాన్ మారినోలో పర్యటించనున్న పోప్ లియో

పోప్ లియో తన ఐదవ అంతర్జాతీయ పర్యటనలో భాగంగా సాన్ మారినోను సందర్శించనున్నారు. 

కేవలం 35 వేల జనాభా కలిగిన ఈ దేశం ప్రపంచంలోని ఐదవ అతి చిన్న దేశం.

వాటికన్ సిటీ మాదిరిగానే సాన్ మారినో కూడా పూర్తిగా ఇటలీ భూభాగంతో చుట్టుముట్టబడి ఉంది.

ప్రపంచంలోనే అత్యంత పురాతన గణతంత్ర దేశంగా సాన్ మారినో గుర్తింపు పొందింది.

క్రీస్తుశకం 1243 నుంచి అనేక దండయాత్రలు, ఆక్రమణ ప్రయత్నాలను ఎదుర్కొంటూనే తన స్వాతంత్ర్యాన్ని కొనసాగిస్తోంది.

సాన్ మారినో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రత్యేకమైనది. దేశానికి ఇద్దరు అధినేతలు ఉంటారు. 
వారిని ‘కెప్టెన్స్ రీజెంట్’ అని పిలుస్తారు. వీరు ప్రతి ఆరు నెలలకు మారుతుంటారు.

దేశంలో ఎక్కువ మంది కతోలికులుగా గుర్తించుకుంటారు. అయితే, ఇటలీతో కలిసి ఉన్న ఒకే మేత్రాసనం, కేవలం 12 విచారణలు మాత్రమే సాన్ మారినోలో ఉన్నాయి.

1982లో రెండవ సెయింట్ జాన్ పాల్ ను, 2011లో పదహారవ పోప్ బెనెడిక్ట్ ను ఆహ్వానించారు. ఇప్పుడు పోప్ లియో రాక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

హోలీ సి, సాన్ మారినో మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పోప్ లియో  ఈ పర్యటనను చేపట్టనున్నారు.

Telugu Survey Popup Image