పోప్ ఫిబ్రవరి 2026 ప్రార్థన ఉద్దేశ్యం


పోప్ ఫిబ్రవరి 2026 ప్రార్థన ఉద్దేశ్యం


పరిశుద్ధ పోప్ లియో గారు ఫిబ్రవరి నెలకు తన ప్రార్థన ఉద్దేశాన్ని విడుదల చేశారు. తన నెలవారీ "ప్రే విత్ ది పోప్" వీడియోను బాధిత పిల్లల కోసం ప్రత్యేక ప్రార్థనతో ప్రారంభించారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక నయం చేయలేని వ్యాధులతో(incurable illnesses) బాధపడుతున్న పిల్లల కోసం ప్రార్థించాలని కోరారు. అలానే వారి కుటుంబాలు మరియు సంరక్షకుల కోసం, వారి శారీరక, మానసిక వేదనను అర్థం చేసుకుంటూ, వారికి అవసరమైన వైద్యం, కరుణ మరియు సమాజ మద్దతు లభించాలని, ఈ పిల్లలలో క్రీస్తు రూపాన్ని గుర్తించి ప్రేమించాలని ఆయన ప్రార్థించమని కోరారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రతి సంవత్సరం దాదాపు 400,000 మంది పిల్లలు మరియు టీనేజర్లు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు, ఇది శిశు మరియు కౌమార మరణాలకు ప్రధాన కారణాలలో ఒకటిగా నిలిచింది.

UN పిల్లల సంస్థ అయిన UNICEF ప్రకారం, 20 ఏళ్లలోపు 2.1 బిలియన్లకు పైగా పిల్లలు మరియు టీనేజర్లు దీర్ఘకాలిక అనారోగ్యాలు లేదా దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్నారు. ఈ అనారోగ్యాల కారణంగా ప్రతి సంవత్సరం 20 ఏళ్లలోపు 1 మిలియన్ పిల్లలు మరణిస్తున్నారు.

పోప్ వరల్డ్‌వైడ్ ప్రార్థన నెట్‌వర్క్ డైరెక్టర్ ఫాదర్ క్రిస్టోబల్ ఫోన్స్ మాట్లాడుతూ  “90 కంటే ఎక్కువ దేశాలలో 20 మిలియన్లకు పైగా ప్రజలు ఈ ఉద్దేశ్యం కోసం ప్రార్థనలో చేరుతున్నారని తెలిపారు. 

 

Article and Design By 

M Kranthi Swaroop