డీకన్ల కోసం ప్రో-లైఫ్ శిక్షణ కార్యక్రమం

డీకన్ల కోసం ప్రో-లైఫ్ శిక్షణ కార్యక్రమం

డీకన్ల కోసం ప్రో-లైఫ్ శిక్షణ కార్యక్రమం

భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 55 మంది డీకన్లు బెంగళూరులోని సెయింట్ పీటర్స్ పొంటిఫికల్ సెమినరీలో మూడు రోజుల పాటు నిర్వహించిన ప్రో-లైఫ్ ఫార్మేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ఆగస్టు  5 నుండి 7 తేదీ వరకు జరిగింది.
 
CCBI ఫ్యామిలీ కమిషన్ ప్రో-లైఫ్ మినిస్ట్రీ అసోసియేట్ సెక్రటరీ శ్రీ అజిన్ జోసెఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.  భవిష్యత్తులో ఫాదర్ లుగా సేవ చేయబోయే డీకన్లు కు జీవ సువార్తను ప్రకటించడం మరియు మానవ జీవితాన్ని గౌరవించడం , పరిరక్షించడం గురించి అవగాహన కల్పించింది.

ఈ శిక్షణలో గర్భస్రావం, ఐవీఎఫ్ (IVF), సరోగసీ, గర్భనిరోధక పద్ధతులు, అశ్లీలత, అలాగే ఆధునిక కాలంలో మానవ లైంగికత, మానవ గౌరవంకు సంబంధించిన వివిధ ప్రశ్నలు మరియు సవాళ్లపై చర్చలు జరిగాయి.

శ్రీ అజిన్ జోసెఫ్ డీకన్లకు “ది చోసెన్ ఎన్‌కౌంటర్” (The Chosen Encounter) గురించి వివరించారు.

మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ముగిసే సమయానికి, మానవ జీవితాన్ని రక్షించడం, కుటుంబాలను బలోపేతం చేయడం, మరియు తమ భవిష్యత్ గురుత్వ సేవలో “దేవుని  సువార్తను” ధైర్యంగా ప్రకటించడం అనే నూతన నిబద్ధతతో డీకన్లు ముందుకు సాగారు. 

 

Article and Design By M Kranthi Swaroop

Telugu Survey Popup Image