CBCI 37వ సర్వసభ్య సమావేశం బెంగళూరులో ప్రారంభమైంది.

CBCI  37వ సర్వసభ్య సమావేశం బెంగళూరులో ప్రారంభమైంది.

కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (CBCI)  37వ సర్వసభ్య సమావేశం బెంగళూరులో ప్రారంభమైంది. ఫిబ్రవరి 4 నుండి 10, 2026 వరకు బెంగళూరులోని సెయింట్ జాన్స్ నేషనల్ అకాడమీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో ఈ సమావేశం జరుగుతోంది.

CBCI జనరల్ బాడీ సమావేశం "విశ్వాసం మరియు దేశం: భారతదేశ రాజ్యాంగ దృక్పథానికి చర్చి సాక్షి" అనే థీమ్‌తో జరుగుతోంది. భారతదేశంలోని శ్రీసభ విశ్వాసం మరియు  నిబద్ధతను  దేశ సామాజిక-రాజకీయ జీవితంలో దాని పాత్రను పునరుద్ఘాటించడానికి ఈ సమావేశం ప్రయత్నిస్తుంది.

CBCI డిప్యూటీ సెక్రటరీ జనరల్ డాక్టర్ మాథ్యూ కోయికల్ గారు పాల్గొన్నవారిని ఆహ్వానించారు. 
ప్రారంభ సమావేశంలో పోప్ లియో XIV సందేశ పఠనం, 2024–2026 సంవత్సరానికి CBCI ద్వైవార్షిక నివేదికను ఆర్చ్ బిషప్ మహా పూజ్య అనిల్ JT కూటో సమర్పించడం జరిగింది.  బిషప్‌లు మరణించిన సభ్యులను నిశ్శబ్దంగా స్మరించుకుంటూ ప్రార్ధించారు.

ఈ సమావేశాన్ని  భారతదేశం మరియు నేపాల్‌కు అపోస్టోలిక్ నున్సియో ఆర్చ్ బిషప్ మహా పూజ్య లియోపోల్డో గిరెల్లి గారు ప్రారంభించారు.  మహా పూజ్య లియోపోల్డో గిరెల్లి గారు మాట్లాడుతూ  బిషప్‌లు(పీఠాధిపతులు) వినయపూర్వకమైన సేవ ద్వారా, ముఖ్యంగా పేదలు మరియు అణగారిన వర్గాల పట్ల క్రీస్తు ప్రేమను చూపించాలని  కోరారు. విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు మానవీయ అభివృద్ధి ద్వారా శ్రీసభ దేశం యొక్క నైతిక మనస్సాక్షికి దోహదపడుతూనే ఉందని ఆయన అన్నారు.

CBCI అధ్యక్షుడు ఆర్చ్ బిషప్ మహా పూజ్య మార్ ఆండ్రూస్ థాజత్ గారు  తన ప్రసంగంలో, 
" ఆశ మరియు బాధ్యత యొక్క మిషనరీలు "గా మారాలని ఆయన బిషప్‌లకు పిలుపునిచ్చారు. సినోడాలిటీ ప్రయాణాన్ని మరింతగా పెంచడం మరియు శ్రీసభలో సామాన్యులు, యువత మరియు మహిళల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం యొక్క ప్రాముఖ్యతను కూడా ఆయన హైలైట్ చేశారు.

CBCI 1944లో స్థాపించబడింది. ఇది లాటిన్, సిరో-మలబార్ మరియు సిరో-మలంకర 174 డియోసెస్‌లకు ప్రాతినిధ్యం వహించే 257 మంది బిషప్‌లను కలిగి ఉంది. CBCI జనరల్ బాడీ సమావేశం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.

 

Article and Design by 

 M kranthi Swaroop