CCBI ప్లీనరీ అసెంబ్లీకి సన్నాహాలు ప్రారంభించిన భువనేశ్వర్ అగ్రపీఠం
ఒడిశాలోని భువనేశ్వర్‌లో జనవరి 28 నుండి ఫిబ్రవరి 4, 2025 వరకు జరగనున్న CCBI ప్లీనరీ అసెంబ్లీకి ఆతిథ్యం ఇవ్వడానికి కటక్-భువనేశ్వర్ అగ్రపీఠం మరియు XIM విశ్వవిద్యాలయంలో సన్నాహాలు జరుగుతున్నాయి.
మెట్రోపోలియన్ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య జాహ్న్ బారువా, SVD. నేతృత్వంలోని స్థానిక నిర్వాహక కమిటీ నవంబర్ 7న భువనేశ్వర్‌లోని XIM యూనివర్సిటీలో పీఠాధిపతులను స్వాగతించే సన్నాహాలను సమీక్షించడానికి మరియు మూల్యాంకనం చేయడానికి సమావేశమైయారు .
రూర్కెలా పీఠాధిపతులు మహా పూజ్య కిషోర్ కుమార్ కుజుర్, బాలాసోర్ పీఠాధిపతులు మహా పూజ్య వర్గీస్ తొట్టంకర, రాయగడ పీఠాధిపతులు మహా పూజ్య అప్లినార్ సేనాపతి, వికార్ జనరల్- గురుశ్రీ . ప్రదోష్ చంద్ర నాయక్, ఛాన్సలర్- గురుశ్రీ దిల్బ్కర్ పరిచా, ఆర్థిక నిర్వాహకులు- గురుశ్రీ మృత్యుంజయ దిగాల్, ఒడిశా నుండి ఇతర సభ ప్రొవిన్షియల్స్ మరియు కమిటీ సభ్యులు కూడా సమావేశానికి హాజరయ్యారు.
CCBI డిప్యూటీ సెక్రటరీ జనరల్ గురిశ్రీ స్టీఫెన్ అలతారా, XIM యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గురిశ్రీ ఆంటోనీ R. ఉవారి, S.J., ఆర్నాల్డ్ స్కూల్ మేనేజర్ గురుశ్రీ రిచర్డ్ వాజ్, S.V.D. మరియు CCBI అసోసియేట్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ గురుశ్రీ క్రిస్టోఫర్ విమల్‌రాజ్ గార్ల నేతృత్వంలో జరిగింది
అసెంబ్లీకి సన్నాహకంగా, CCBI జనరల్ సెక్రటేరియట్ దేశవ్యాప్తంగా ఉన్న మేత్రాసనాలు మరియు మత సభలకు సన్నాహక పత్రం మరియు ప్రశ్నాపత్రాన్ని పంపిణీ చేసి వారి సలహాలు సూచనలు సేకరించనుంది.
అనంతరం ఈ ప్రతిస్పందనల ఆధారంగా వర్కింగ్ డాక్యుమెంట్ తయారు చేయబడుతుంది.
132 మేత్రాసనాలు మరియు 208 మంది పీఠాధిపతులు ప్రాతినిధ్యం వహిస్తున్న CCBI ప్లీనరీ అసెంబ్లీ ఆసియాలోనే అతిపెద్ద ఎపిస్కోపల్ కాన్ఫరెన్స్‌గా మరియు ప్రపంచవ్యాప్తంగా నాల్గవ అతిపెద్దది సమావేశం కానుంది