సెయింట్ జాన్ లాటరన్ ఆర్చ్ బాసిలికాను సందర్శించిన పోప్

ఆదివారం మే 25 సాయంత్రం రోమ్ పీఠాధిపతుల కథడ్రల్ సెయింట్ జాన్ లాటరన్ ఆర్చ్ బాసిలికాలో XIV లియో పోప్ దివ్యబలిపూజను సమర్పించారు.

రోమ్ కేథడ్రల్‌కు వెళ్లే ముందు, రోమ్‌లోని Capitoline Hill వద్ద ఆగారు, ఇది నగర పౌర మరియు ప్రజాస్వామ్య పరిపాలన స్థానం, అక్కడ పోప్ ను నగర మేయర్ Roberto Gualtieri  స్వాగతించారు.

పోప్ మేయర్ మరియు అక్కడ ఉన్న పౌర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

సువార్త నుండి జీవనాధారమైన మానవత్వం మరియు నాగరికత విలువలతో రోమ్ ఎల్లప్పుడూ విభిన్నంగా ఉంటుంది అని తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 
 

Telugu Survey Popup Image