సామాజిక సేవలో ముందుంటామన్న కర్నూలు పీఠకాపరి
కర్నూలు మేత్రాసన సాంఘిక సేవాసంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 26 ఆదివారం 70మంది మహిళలకు కర్నూలు పీఠకాపరి మహా పూజ్య.డా|| గోరంట్ల జ్వాన్నెస్ O.C D గారు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పీఠాధిపతులవారు మాట్లాడుతూ "మహిళలు స్వయం సమృద్ధి, సాధికారత సాధించాలి" అన్నారు .
మహిళాభ్యుదయం కోసం తమ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి, సామాజిక, సాంఘిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
కర్నూలు మేత్రాసన సాంఘిక సేవాసంస్థ డైరెక్టర్ ఫాదర్ తోట జోసఫ్ మాట్లాడుతూ "గత 40ఏళు గా కర్నూలు మేత్రాసనానికి చెందిన ఈ సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో ఉపాధి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు.
బోర్లు, వాటర్ ప్లాంట్స్ లాంటివి ఏర్పాటు చేస్తూ రాయలసీమ అభివృద్ధిలో భాగస్వామ్యులమవుతున్నామన్నారు.
బిషప్ గోరంట్లు జ్వాన్నేస్ పీఠాధిపతులుగా బాధ్యతలు చేపట్టిన రెండేళ్ల కాలంలో 7బ్యాచ్ లకు ఇప్పటికే కుట్లు, అల్లికలు, బ్యూటీషియన్, సెల్ ఫోన్ రిపేరీ లాంటి రంగాలలో ఉపాధి శిక్షణనిచ్చామన్నారు.
త్వరలో కాలానుగుణంగా, సామాజిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతన రంగాలలో సాంకేతిక శిక్షణ ఇవ్వబోతున్నాము అన్నారు.
అనంతరం మైక్రో క్రెడిట్ ప్రోగ్రాంలో భాగంగా కుట్టు నేర్చుకున్న మహిళలకు కుట్టు మిషన్లతో పాటు సర్టిఫికెట్ అందజేశారు.