వీలైనంత త్వరగా యుద్ధాన్ని ముగించండి - కార్డినల్ పరోలిన్

1.     వీలైనంత త్వరగా యుద్ధాన్ని ముగించండి - కార్డినల్ పరోలిన్

 

ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వాటికన్ విదేశాంగ కార్యదర్శి మహాపూజ్య కార్డినల్ పరోలిన్ గారు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ముఖాముఖిగా కలిస్తే తాను "వీలైనంత త్వరగా దీనికి ముగింపు పలకాలని, ఎందుకంటే ఉద్రిక్తతలు పెరిగే అసలు ప్రమాదం పొంచి ఉంది" అని తాను ఆయనను కోరతానని, ప్రత్యేకంగా "లెబనాన్‌ను దాని మానాన దాన్ని వదిలేయాలని" చెపుతానని కార్డినల్ పరోలిన్ గారు పేర్కొన్నారు.

మధ్యప్రాచ్యంలో ఘర్షణలు తీవ్రతరం కావడంపై పరోలిన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాన్ని ముగించి, దౌత్యం మరియు సంభాషణల ద్వారా శాంతిని నెలకొల్పాలనే సందేశాన్ని ఇజ్రాయెల్ వాసులకు కూడా తెలియజేయాలని పరోలిన్ సూచించారు.

రోమ్‌లోని ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్‌లో, ""I Am a Son of Saint Augustine: Pope Leo XIV on His Favorite Saint" అనే పుస్తకావిష్కరణ సందర్భంగా , కార్డినల్ పరోలిన్ గారు అంతర్జాతీయ పరిస్థితిపై విలేకరుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కాంటగల్లి ప్రచురించిన ఈ పుస్తకాన్ని వాటికన్ పాత్రికేయుడు ఇగ్నాజియో ఇంగ్రావో మరియు అగస్టీనియన్ ఫాదర్ గియుసెప్పె పగానో గారు రచించారు.

ఈ పుస్తకం పోప్ పదవికి ఎన్నికవడానికి ముందు కార్డినల్ రాబర్ట్ ప్రివోస్ట్‌గా పిలువబడిన పోప్ లియో XIV యొక్క జీవితాన్ని మరియు ఆధ్యాత్మిక పునాదిని విశ్లేషిస్తుంది.

 

Article and Design by M kranthi swaroop