రోమ్ -సెయింట్ పీటర్స్ బసిలికా ప్రాభవాన్ని ప్రపంచానికి చూపించనున్న AI
2025లో జూబ్లీ వేడుకలకు బసిలికా సిద్ధమవుతున్నందున, మైక్రోసాఫ్ట్ మరియు హెరిటేజ్ డిజిటలైజేషన్ కంపెనీ ఐకోనెమ్ సహకారంతో AI -కృత్రిమ మేధస్సు ద్వారా రూపొందించిన "సెయింట్ పీటర్స్ బసిలికా: AI-మెరుగైన అనుభవం,” ను సోమవారం నవంబర్ 11 , కొత్త డిజిటల్ పోర్టల్‌ను ఆవిష్కరించింది.
సెయింట్ పీటర్స్ బసిలికాను ప్రపంచ ప్రేక్షకులకు చేరువ చేయడం మరియు యాత్రికులు,సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా చేసుకుంది.
సెయింట్ పీటర్స్ బసిలికా ఆర్చ్‌ప్రిస్ట్ కార్డినల్ మౌరో గాంబెట్టి గారు దీనిని "వేసవి రాత్రిలో నక్షత్రాల ఆకాశం"ని చూడటంలా ఉంది అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
వాటికన్ మరియు మైక్రోసాఫ్ట్ మధ్య భాగస్వామ్యం దాని ఆశయానికి మాత్రమే కాకుండా విశ్వాసం మరియు వారసత్వ సేవలో సాంకేతికతను వినూత్నంగా ఉపయోగించడం కూడా గుర్తించదగినదని మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ విలేకరుల సమావేశంలో అన్నారు.
"ఇది రోమ్కు వచ్చే యాత్రికుల ఆధ్యాత్మిక అనుభవాన్ని మెరుగుపరుస్తుంది అని నేను నమ్ముతున్నాను," మరియు ఇది చరిత్రకు జీవం పోస్తుంది" ఆయన అన్నారు
AI -కృత్రిమ మేధస్సు విశ్వాసాన్నిపెంపొందించే సాధనంగాను, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడానికి వాటికన్ సుముఖతను తెలియచేస్తుంది అని స్మిత్ అన్నారు