రాంచీ సహాయ బిషప్‌గా ఫాదర్ ఆనంద్ డేవిడ్ జల్క్సో నియామకం
రాంచీ సహాయ బిషప్‌గా ఫాదర్ ఆనంద్ డేవిడ్ జల్క్సో నియామకం
రాంచీ అతిమేత్రాసన వికార్ జనరల్ ఫాదర్ ఆనంద్ డేవిడ్ జల్క్సో (51) గారిని రాంచీ ఆర్చ్డయాసిస్ సహాయ బిషప్‌గా పరిశుద్ధ లియో XIV పాపు గారు నియమించారు.ప్రస్తుత రాంచీ అర్చ్ బిషప్ మహా పూజ్య విన్సెంట్ ఐండ్ (Archbishop Vincent Aind) గారికి సహాయకుడిగా వ్యవహరిస్తారు.
ఫాదర్ ఆనంద్ డేవిడ్ జల్క్సో గారు 20 నవంబర్ 1975న జార్ఖండ్‌లోని మందార్‌లో జన్మించారు. 15 మే 2006న రాంచీ అర్చ్డయాసిస్ కోసం కాథలిక్ ఫాదర్ గా అభిషిక్తులయ్యారు.మంగళూరులోని ఫాదర్ ముల్లర్స్ హాస్పిటల్ నుండి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పూర్తి చేశారు.
దివంగత కార్డినల్ మహా పూజ్య టెలెస్ఫోర్ టొప్పో గారికి వ్యక్తిగత కార్యదర్శిగా (2006–2009), అలాగే ఢిల్లీలోని క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (CBCI) సెక్రటరీ జనరల్‌కు కార్యదర్శిగా (2015–2017) పనిచేశారు.
గత రెండు దశాబ్దాలుగా ఈయన స్థానిక మరియు జాతీయ స్థాయిలలో వివిధ ఆధ్యాత్మిక, పరిపాలనా సేవలను అందించారు. నార్త్ ఇండియాలోని CBCI సొసైటీ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ అసోసియేట్ డైరెక్టర్‌గా వైద్య సేవల పరిపాలనను చూశారు.
Article and Design By M kranthi Swaroop