"మీరు చరిత్రను మార్చగలరు, ప్రేమతో దాన్ని చేయండి" - పొప్ లియో

"మీరు చరిత్రను మార్చగలరు, ప్రేమతో దాన్ని చేయండి" - పొప్ లియో 

స్పెయిన్‌లో తన ఆరు రోజుల అపోస్తలిక పర్యటనలో భాగంగా మొదటి రోజున పరిశుద్ధ లియో XIV పాపు గారు  మాడ్రిడ్‌లో లక్షలాది మంది యువతను  ఉద్దేశించి  మాట్లాడారు.

అధికారుల అంచనా ప్రకారం, ఈ కార్యక్రమానికి 6 లక్షల మందికి పైగా యువతీ యువకులు  హాజరయ్యారు.పరిశుద్ధ లియో XIV పాపు గారికి స్పానిష్ భాషపై మంచి పట్టు ఉంది. ఆయన అనేక సందర్భాల్లో ఆ భాషలో ప్రసంగించారు. ఒకసారి లక్షలాది మంది యువతతో నిండిన సభలో మాట్లాడుతూ, “మీరు చరిత్రను మార్చగలరు, ప్రేమతో దాన్ని చేయండి” అని ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు.

యువత అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ పరిశుద్ధ లియో XIV పాపు గారు, “మన ప్రభువైన యేసు క్రీస్తు శిష్యులు ఎల్లప్పుడూ సమకాలీనులే, కానీ కాలానుగత ధోరణులకు బందీలు కారు. క్రీస్తులో మనకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది” అని అన్నారు.

క్రీస్తు ప్రేమ మనలను విముక్తులను చేస్తుందని, ఆ ప్రేమలో జీవించే వ్యక్తి ఎలాంటి ఒత్తిడి, మోసం లేదా ప్రలోభాలను ఎదుర్కొన్నా తన స్వేచ్ఛను కోల్పోడని పరిశుద్ధ లియో XIV పాపు గారు నొక్కిచెప్పారు.

“మేము కేవలం ఫ్యాషన్లు, తాత్కాలిక ధోరణులను అనుసరించే వారు కాదు; సత్యాన్ని అనుసరించే క్రీస్తు శిష్యులం. భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాము,” అని పరిశుద్ధ లియో XIV పాపు గారు అన్నారు.

అలాగే యువతకు ఒక ముఖ్యమైన బాధ్యతను గుర్తుచేస్తూ, “నిజమైన మనుషులుగా జీవించండి. పైపై ప్రదర్శనలకు పరిమితం కాకుండా, విశ్వసనీయతతో జీవించండి. రోజువారీ ఆహారం కోసం ఆకలితో ఉన్నట్లే, న్యాయం మరియు సత్యం కోసం కూడా తపించండి” అని ఆయన పిలుపునిచ్చారు.

Article and design by M Kranthi Swaroop

 

 

Telugu Survey Popup Image