మదర్ తెరిసా సేవా స్ఫూర్తిని స్మరించిన అమెరికా రాయబారి సెర్గియో గోర్

మదర్ తెరిసా సేవా స్ఫూర్తిని స్మరించిన అమెరికా రాయబారి సెర్గియో గోర్

భారతదేశంలో అమెరికా రాయబారి మరియు దక్షిణ, మధ్య ఆసియా ప్రత్యేక దూత అయిన సెర్గియో గోర్ గారు  పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా బుధవారం కోల్‌కతాలో పర్యటించారు. 'సిటీ ఆఫ్ జాయ్'గా పిలువబడే ఈ నగరంలో తన సంక్షిప్త పర్యటనలో భాగంగా మిషనరీస్ ఆఫ్ ఛారిటీ మరియు విక్టోరియా మెమోరియల్ హాల్‌ను మే 14 న సందర్శించారు. 

ఈ పర్యటన అనంతరం చేసిన ఒక ఫేస్‌బుక్ మరియు X ఖాతాలో
తన పర్యటన విశేషాలను పంచుకుంటూ, సెర్గియో గోర్ గారు  X ఖాతాలో ఇలా రాశారు, “హలో కోల్‌కతా! మిషనరీస్ ఆఫ్ ఛారిటీని సందర్శించడం, సిస్టర్స్‌తో కలిసి ప్రార్థించడం, మరియు మదర్ థెరిసా వారసత్వాన్ని స్మరించుకోవడం గౌరవంగా ఉంది. మదర్ థెరిసా యొక్క క్రైస్తవ విశ్వాసం మరియు సేవా జీవితం ఖండాలవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే  ఉన్నాయని గోర్ పేర్కొన్నారు.

భారతదేశం, అమెరికాల మధ్య దౌత్య, మానవతా మరియు సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడైన సెర్గియో గోర్, జనవరి 2026లో భారత్‌కు 27వ అమెరికా రాయబారిగా బాధ్యతలు చేపట్టారు. 

Article By M kranthi Swaroop