నిష్పాక్షిక సత్యాన్ని తిరస్కరించడం — మతం, విజ్ఞానశాస్త్రానికి అతిపెద్ద ముప్పు - లియో పాపు గారు
నిష్పాక్షిక సత్యాన్ని తిరస్కరించడం — మతం, విజ్ఞానశాస్త్రానికి అతిపెద్ద ముప్పు - లియో పాపు గారు
మానవులను మరియు ప్రకృతి ప్రపంచాన్ని బాధ్యతారహితంగా దోపిడీ చేయడం వల్ల భూగోళ సంరక్షణకు ముప్పు వాటిల్లుతుందని పరిశుద్ధ లియో పాపు గారు అన్నారు. విజ్ఞానశాస్త్రం మరియు శ్రీసభ రెండూ దీని గూర్చి స్పష్టంగా బోధిస్తున్నాయని పరిశుద్ధ లియో పాపు గారు తెలిపారు .
నేడు మతం మరియు విజ్ఞానశాస్త్రం రెండూ ఎదుర్కొంటున్న ప్రధాన ముప్పు, నిష్పాక్షిక సత్యం యొక్క ఉనికిని తిరస్కరించడమేనని పరిశుద్ధ లియో పాపు గారు అన్నారు. కాస్టెల్ గాండోల్ఫోలో ఉన్న అబ్జర్వేటరీ కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే వాటికన్ అబ్జర్వేటరీ ఫౌండేషన్ సభ్యులకు మే 11న ఇచ్చిన సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
పరిశుద్ధ లియో పాపు గారు మాట్లాడుతూ " “ఈనాడు విజ్ఞానశాస్త్రం మరియు మతం ఒక భిన్నమైన, బహుశా మరింత ప్రమాదకరమైన ముప్పును ఎదుర్కొంటున్నాయని, అదేమిటంటే నిష్పాక్షిక సత్యం యొక్క ఉనికినే తిరస్కరించే వారి నుంచేనని,” అని అన్నారు.
“మన గ్రహాన్ని సంరక్షించడం, దానిపై నివసించే వారి శ్రేయస్సును కాపాడడం, ముఖ్యంగా బాధ్యతారహిత దోపిడీ వల్ల ప్రాణాపాయంలో ఉన్న అత్యంత బలహీనుల పట్ల మనకు బాధ్యత ఉందని పరిశుద్ధ లియో పాపు గారు అన్నారు . విజ్ఞానశాస్త్రం మరియు శ్రీసభ రెండూ వీటిపై స్పష్టంగా బోధిస్తున్నప్పటికీ, మన ప్రపంచంలో చాలామంది దీనిని అంగీకరించడానికి నిరాకరిస్తున్నారు,” అని పరిశుద్ధ లియో పాపు గారు తెలిపారు.
చివరిగా, “సృష్టిని మరింతగా అర్థం చేసుకోవాలనే కోరిక, ప్రతి మానవుని హృదయంలో నివసించే దేవుని కోసం ఉన్న అలుపెరుగని తపనకు ప్రతిబింబం మాత్రమే,” అని పరిశుద్ధ లియో పాపు గారు అన్నారు.
Article and design by M Kranthi Swaroop