జోసెఫ్ విజయ్ తమిళనాడుకు మొట్టమొదటి 'క్రైస్తవ' ముఖ్యమంత్రి కానున్నారు
జోసెఫ్ విజయ్ తమిళనాడుకు మొట్టమొదటి 'క్రైస్తవ' ముఖ్యమంత్రి కానున్నారు
విజయ తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ గారు రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్ మరియు తల్లి శోభా గారు హిందూ. విజయ్, చిన్నతనంలో క్యాథలిక్ చర్చిలో జ్ఞానస్నానం మరియు దివ్యసప్రసాదాన్ని తీసుకున్నారు. వేలన్కన్ని మరిత్తల్లి భక్తుడు.విజయ్ ఇద్దరు తల్లిదండ్రుల మతాల ప్రభావంతో పెరిగారు మరియు ఇద్దరి ఆచారాలను గౌరవిస్తారు.
విజయ్ తల్లిదండ్రులకు 'వి.వి. క్రియేషన్స్' అనే నిర్మాణ సంస్థ ఉండేది. దాని లోగో లో వేలన్కన్ని మాత స్వరూపాన్ని ఉంచారు . ఆయన గత అధికారిక లెటర్ హెడ్ పైభాగంలో 'జీసస్ సేవ్స్' అని వ్రాయబడి ఉంది.
కేరళలో క్రైస్తవ సమాజం నుండి ఏకే ఆంటోనీ, ఊమెన్ చాందీ గార్లు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్లో శ్రీ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు మరియు అయన కుమారుడు శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు క్రైస్తవ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరి పాలనలోనే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, ఆరోగ్యశ్రీ (108),అమ్మ ఒడి, రైతు భరోసా, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, నాడు నేడు ,విద్యా దీవెన వంటివి సంక్షేమ పథకాలను అమలుచేసి పేదల పక్షాన నిలిచారు.
దక్షిణాది రాష్ట్రాలలో ఇప్పటివరకు ఒక్క 'క్రైస్తవ' ముఖ్యమంత్రి కూడా లేని ఏకైక రాష్ట్రం కర్ణాటక.
Article and Design By m kranthi Swaroop