ఘనంగా పునః నిర్మాణ దేవాలయ ప్రతిష్ఠోత్సవము

ఘనంగా పునః నిర్మాణ దేవాలయ ప్రతిష్ఠోత్సవము

విశాఖ అతిమేత్రాసనం, మక్కువ విచారణ, పరిశుద్ధ ఫాతిమా మాత దేవాలయ పునః నిర్మాణ ప్రతిష్ఠోత్సవము ఘనంగా జరిగింది.  విచారణ కర్తలు గురుశ్రీ మరియాదాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

నవంబర్ 12, మంగళవారం రోజున జరిగీన ఈ వేడుకలకు అధిక సంఖ్యలో గురువులు, విశ్వాసులు, సిస్టర్స్, యువతీ యువకులు హాజరయ్యారు.

ఏలూరు పీఠాధిపతులు మరియు విశాఖ అతిమేత్రాసన అపోస్తలిక పాలనాధికారి మహా పూజ్య డా|| పొలిమెర జయరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని  పునః నిర్మాణ దేవాలయాన్ని ఆశీర్వదించి ఇతర గురువులతో కలసి దివ్య పూజాబలిని సమర్పించారు.

విశాఖ అతిమేత్రాసన వికార్ జనరల్ మరియు మహారాణిపేట విచారణ కర్తలు గురుశ్రీ దుగ్గంపూడి బాలశౌరి గారు ఈ కార్యక్రమంలో పాల్గొని  ప్రత్యేక ప్రార్థనలు చేసారు.  ఈ కార్యక్రమం లో బొబ్బిలి విచారణ కర్తలు గురుశ్రీ ఒమ్మి మోహన్ ప్రసాద్ గారు, గురుశ్రీ బందనాదం జోసెఫ్ గారు, గురుశ్రీ శౌరిబాబు గారు,  గురుశ్రీ జయరాజు గారు, గురుశ్రీ మరియాదాస్ గారు, గురుశ్రీ రయ్యప్ప గారు, గురుశ్రీ కిషోర్ గారు, గురుశ్రీ యేసు గారు,  మరియు ఇతర గురువులు పాల్గొన్నారు.  

విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు. సిస్టర్స్ మరియు యువతీ యువకులు తమ సహాయ సహకారాలని అందించారు.

విచారణ కర్తలు గురుశ్రీ మరియాదాస్ గారు ఈ  కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు  తెలిపారు.  

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer