ఇటాలియన్ మెటీరియల్ కార్ప్స్ అధికారులతో సమావేశమైన పొప్ ఫ్రాన్సిస్
నవంబర్ 7,2024 ఇటాలియన్ ఆర్మీ పునీత క్రిస్టోఫర్ తమ పోషకుడిగా ప్రకటించబడిన 70వ వార్షికోత్సవం సందర్భంగా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు రవాణా మరియు మెటీరియల్ కార్ప్స్ అధికారులు మరియు సైనికులతో సమావేశమయ్యారు.
క్లెమెంటైన్ హాల్లో వారిని స్వాగతిస్తూ, ధైర్యాన్ని మరియు సేవను మూర్తీభవించిన అమరవీరుడు పునీత క్రిస్టోఫర్‌ను తమ పోషకుడిగా ఎన్నుకున్నందుకు మిలటరీలను ప్రశంశించారు
మానవతా అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేసినందుకు ఇటాలియన్ సైనికులకు పోప్ ధన్యవాదాలు తెలిపారు
భూకంపాలు, వరదలు మరియు కోవిడ్-19 వంటి అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం, వ్యాక్సిన్ల వంటి ముఖ్యమైన వనరులను పంపిణీ చేయడం, అంకితభావంతో సేవలందించినందుకు ఇటాలియన్ మిలిటరీ కార్ప్స్ వారిని ఫ్రాన్సిస్ పాపు గారు మెచ్చుకున్నారు.
అంతర్జాతీయ శాంతి పరిరక్షక ప్రయత్నాలలో భాగంగా సైనిక మరియు మానవతా ప్రయోజనాల కొరకు వస్తువులను రవాణా చేయడాని కూడా ఆయన గుర్తించారు
చురుకైన విధుల తర్వాత కూడా, చాలా మంది స్వచ్ఛంద సేవకులుగా సమాజానికి మద్దతునిస్తూనే ఉన్నారు, సేవా నిబద్ధతను జీవితకాల విలువ అని గుర్తుచేశారు.
క్రిస్టోఫర్ అనే పేరుకు "క్రీస్తును మోసుకెళ్ళేవాడు" అని అర్ధం అని గుర్తుచేసారు.
మిలటరీ కార్ప్స్ వారి గొప్ప పనిలో కొనసాగడానికి మరియు దేవుని రక్షణ మరియు మార్గదర్శకత్వం కోసం ప్రార్థనతో వారి పోషకుడైన పునీత క్రిస్టోఫర్ యొక్క ఆశీర్వాదాన్ని కోరడం ద్వారా పొప్ గారు ఈ సమావేశాన్ని ముగించారు.