అస్సిసి పర్యటనను రద్దు చేసుకున్న పోప్ లియో XIV

అస్సిసి పర్యటనను రద్దు చేసుకున్న పోప్ లియో XIV

అస్సిసి పర్యటనను రద్దు చేసుకున్న పోప్ లియో XIV

వాటికన్ సిటీ, అక్టోబర్ 23: ఊపిరితిత్తులకు సంబంధించిన శస్త్రచికిత్స అనంతరం పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం అవసరమైన నేపథ్యంలో, పరిశుద్ధ లియో పాపు గారు తన అస్సిసి పర్యటనను రద్దు చేసుకున్నారు. వైద్యుల సూచన మేరకు అక్టోబర్ 27న ఇటలీలోని అస్సిసి పట్టణంలో జరగనున్న అంతర్మత శాంతి సమావేశానికి ఆయన హాజరుకావడం లేదని వాటికన్ ప్రెస్ ఆఫీస్ ప్రకటించింది.

అక్టోబర్ 13న పోప్‌కు కుడి ఊపిరితిత్తి దిగువ భాగాన్ని తొలగించే శస్త్రచికిత్స నిర్వహించారు. పరీక్షల్లో ఊపిరితిత్తుల అడెనోకార్సినోమా (Adenocarcinoma) నిర్ధారణ అయినప్పటికీ, క్యాన్సర్ నిర్దిష్ట ప్రాంతానికే పరిమితమైందని, తదుపరి చికిత్స అవసరం లేదని వైద్యులు వెల్లడించారు.

తాజాగా నిర్వహించిన ఛాతీ ఎక్స్‌రే పరీక్షలో ఆయన కోలుకునే ప్రక్రియ ఆశాజనకంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే శస్త్రచికిత్స జరిగి కొద్దిరోజులే అయినందున, ముందుజాగ్రత్త చర్యగా హెలికాప్టర్ ప్రయాణం చేయకూడదని వైద్యులు సూచించారు. దీంతో పోప్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. 

పర్యటనకు హాజరుకాలేకపోయినప్పటికీ, సమావేశ నిర్వాహకులు, మతపెద్దలు, వివిధ మతాల ప్రతినిధులు, ఇతర అతిథులకు తన సందేశాన్ని పంపనున్నట్లు పోప్ కార్యాలయం తెలిపింది.

 

Article and Design By M Kranthi Swaroop

Telugu Survey Popup Image