అస్సాంలో మేత్రాసన స్థాయి సాధికారత సదస్సు

అస్సాం,మార్గరెటాలోని డివైన్ రిట్రీట్ సెంటర్‌లో అక్టోబరు 1 నుండి 3 వరకు దిబ్రూఘర్, ఇటానగర్, మియావో మరియు తేజ్‌పూర్ మేత్రాసన నాయకుల కొరకు సాధికారత సదస్సు జరిగింది.

దీనిని మియావో MIAO పీఠాధిపతులు మహా పూజ్య జార్జ్ పల్లిప్పరంబిల్ గారు ప్రారంభించారు.

ప్రాథమిక మతపరమైన సంఘాల (BEC) చొరవను మెరుగుపరచడానికి ఈ  సమావేశంలో దాదాపు 220 మంది, విశ్వాసులు, మఠవాసులు మరియు గురువులు పాల్గొన్నారు.

జార్ఖండ్ నుండి వ్యాఖ్యాతలుగా వచ్చిన శ్రీమతి రేఖ మరియు శ్రీమతి అను గార్లు " ప్రస్తుత సమాజంలో యువత పాత్రను మరియు నాలుగు మేత్రాసనాల నుండి పాల్గొనవారు   ఎలాంటి నమూనాలను అనుసరించాలి వారికి తెలియచేసారు.

విశ్వాసులని ప్రోత్సహించడంలో, ప్రతీ విచారణలో BEC కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసేలా గురువులు సహాయపడాలని అన్నారు

"ఈ సదస్సు నాలుగు మేత్రాసనాల మధ్య ఒక ముఖ్యమైన సహకారాన్ని గుర్తించి సాధారణ నాయకత్వాన్ని శక్తివంతం చేయడానికి వేదికను ఏర్పాటు చేసింది." ఇటానగర్‌కు చెందిన గురుశ్రీ అవినాష్ డి'మెల్లో అన్నారు 

సదస్సు ముగిసే సమయానికి, ప్రతి మేత్రాసన నిర్దిష్ట లక్ష్యాలతో కార్యాచరణ ప్రణాళికలను ఏర్పాటు చేసింది, ఈ ప్రాంతం అంతటా సంఘం మరియు ఆధ్యాత్మిక వృద్ధిని పెంపొందించడంలో శ్రీసభ నిబద్ధతను బలోపేతం చేస్తుంది.

Tags