సమకాలీన ప్రపంచంలో శ్రీసభ బాధ్యతలను వివరించిన పోప్

సెయింట్ పేతురు కూడలిలో జరిగిన సాధారణ బుధవారం సమావేశంలో రెండవ వాటికన్ మహాసభ పత్రం ‘గౌదియుమ్ ఎట్ స్పెస్’పై పోప్ లియో తన వివరణనుచేసారు 

సమకాలీన ప్రపంచంలో శ్రీసభ నిర్వహించాల్సిన బాధ్యతను పోప్ లియో వివరించారు 

ప్రపంచ నలుమూలల నుండి  వచ్చిన వేలాది మంది యాత్రికులతో మాట్లాడుతూ, శ్రీసభ భౌతిక ప్రపంచంలోని వాస్తవికతలను విస్మరించకుండా, తన సాక్ష్యం ద్వారా వాటిని సానుకూలంగా మలచేందుకు కృషి చేయాలని పోప్ అన్నారు.

జీవితం యొక్క ఆరంభం, గమ్యం, ప్రేమ, బాధల వంటి లోతైన ప్రశ్నలపై ప్రజలు ఆలోచించేలా చేయడం శ్రీసభ ప్రధాన కర్తవ్యమని పోప్ తెలిపారు.

ప్రస్తుత సమాజ నిర్మాణంలో శ్రీసభ పాత్ర ఎంతో ఉందని, అయితే అది రాజకీయాల ద్వారా కాకుండా విశ్వాసం, దానధర్మం, న్యాయం, శాంతి, సోదరభావానికి సాక్ష్యంగా నిలవాలని   పోప్ కోరారు.

సువార్తా ధర్మాన్ని సమర్థవంతంగా నెరవేర్చేందుకు జ్ఞానస్నానం పొందిన ప్రతీ వ్యక్తి పరిశుద్ధాత్మ అనుగ్రహంతో విశ్వాసంలో జీవించాలని అన్నారు.

విశ్వాసాన్ని ప్రకటిస్తూ దానికి విరుద్ధంగా రోజువారీ జీవితాన్ని గడపడం ప్రస్తుత కాలంలోని అత్యంత తీవ్రమైన తప్పిదాలలో ఒకటని పోప్ పేర్కొన్నారు.

చివరగా, పరిశుద్ధాత్మ ప్రేరణలకు మన హృదయాలు తెరచి ఉంచాలని, తద్వారా ప్రతి ఒక్కరూ దేవుని రాజ్య స్థాపనకు తమ వంతు సహకారం అందించాలని యాత్రికులను ప్రోత్సహించారు.

Telugu Survey Popup Image