వాటికన్ జెండర్మెరీ కొరకు దివ్యబలి పూజను సమర్పించిన పోప్
వాటికన్ గార్డెన్స్‌లో అక్టోబర్ 3 న వాటికన్ జెండర్మెరీ కొరకు ప్రత్యేక దివ్యబలి పూజను పోప్ లియో అర్పించారు. జెండర్మెరీ వాటికన్‌కు చెందిన సైనిక పోలీసు బలగం.
సుమారు 130 మంది సభ్యులతో కూడిన ఈ భద్రతా బలగం నిఘా, సమాచార సేకరణ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోప్, హోలీ సీ మరియు దాని ఆస్తుల భద్రత వంటి బాధ్యతలను నిర్వహిస్తుంది.
దివ్యబలిపూజ ప్రారంభానికి ముందు, 15 మంది జెండర్మెరీ సభ్యులు...ప్రమాణ స్వీకారం చేసారు
వారి ప్రధాన బాధ్యత వాటికన్‌కు కాపలాదారులుగా ఉండటమే అయినప్పటికీ, దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండటానికి, ఇతరుల పట్ల శ్రద్ధ చూపుతూ సేవ చేయడానికి ముందుగా తమను తాము కూడా జాగ్రత్తగా చూసుకోవాలని పోప్ వారికి సూచించారు.
ఈ సేవ ప్రభువు ద్రాక్షతోటలో పనిచేసే కూలీలుగా ఉండటానికి ఒక మార్గం.
ప్రవేశ ద్వారాలు, భవనాలు మాత్రమే కాదు, ముఖ్యంగా ప్రజలు మీ సంరక్షణకు అప్పగించబడ్డారు. ఇతరులను...పరిష్కరించాల్సిన సమస్యలుగా కాకుండా, గౌరవించాల్సిన మరియు శ్రద్ధగా చూసుకోవాల్సిన వ్యక్తులుగా మీరు చూడటం ఎంతో అందంగా ఉంది అని పోప్ వారితో అన్నారు
ఈ పవిత్ర బలిలో అధికారుల కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.
వారు చేసే త్యాగాలకు పోప్ వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే, విధుల్లో ఉన్న అధికారుల భద్రత గురించి ఆందోళన చెందే కుటుంబ సభ్యుల భావాలను తాను అర్థం చేసుకుంటున్నానని ఆయన అన్నారు.
