ఫ్రాన్స్ యువతతో జాగరణలో పాల్గొన పోప్ లియో

ఫ్రాన్స్‌లోని సెయింట్-డెనిస్‌లో పోప్ లియో సమక్షంలో జరిగిన విజిల్ కార్యక్రమం విశ్వాసం, చరిత్ర, యువత ఆశయాలను ప్రతిబింబించే ప్రత్యేక కార్యక్రమంగా నిలిచింది.

సుమారు 80 వేల మంది యువత పాల్గొన్న ఈ జాగరణలో, ఫ్రాన్స్ చరిత్రను పది దృశ్యాల ద్వారా ఆవిష్కరించారు. 

తరతరాలుగా అందించబడుతున్న విశ్వాస వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ, దేశ చరిత్రలో కీలక పాత్ర పోషించిన అనేక మంది పునీతుల జీవితాలను ప్రదర్శించారు.

పునీత జోన్ ఆఫ్ ఆర్క్, పునీత విన్సెంట్ డి పాల్, the Curé of Ars క్యూరే ఆఫ్ ఆర్స్, పునీత Thérèse of Lisieux వంటి పునీతుల జీవితాలను యువత ముందుకు తీసుకువచ్చారు.

13వ శతాబ్దంలో చేసినట్లుగానే, తొమ్మిదవ పునీత లూయిస్ ముళ్ల కిరీటాన్ని తీసుకువచ్చిన దృశ్యాన్ని కూడా ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో యువత తమ జీవితాలకు సంబంధించిన ప్రశ్నలను పోప్ తో  పంచుకున్నారు.

భవిష్యత్తుపై అనిశ్చితి, భావోద్వేగ బంధాల తాత్కాలికత, సంబంధాల బలహీనత వంటి అంశాలు నేటి యువతను ప్రభావితం చేస్తున్నాయని అన్నారు.

అలాగే స్క్రీన్‌లతో నిరంతరం గడపడం వల్ల కలిగే అలసట, వాతావరణ మార్పులపై ఆందోళన, ఆర్థిక మరియు అంతర్జాతీయ పరిస్థితులపై ఉన్న భయాలు కూడా యువతపై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు.

ఈ భావాలను శ్రద్ధగా ఆలకించాలని, యువత తమ హృదయాలను ప్రభువు పిలుపుకు  తెరిచి ఉంచాలని పోప్ అన్నారు

సోషల్ మీడియాలో వచ్చే “లైక్స్” కోసం వెతికే జీవనశైలిపై కూడా పోప్  మాట్లాడారు.
ఎన్నో “లైక్స్” వచ్చినప్పటికీ, మనిషి తనలో తాను ఒంటరిగా మిగిలిపోవచ్చని ఆయన హెచ్చరించారు.

క్రైస్తవుని పోరాటం ఇతరులకు వ్యతిరేకంగా కాదని పోప్ స్పష్టం చేశారు.

హింస, ధిక్కారం, అణచివేత క్రైస్తవుని ఆయుధాలు కావని,
తనను తాను అర్పించుకునే ప్రేమే... క్రైస్తవుని ఏకైక ఆయుధమని పోప్అన్నారు
 

Telugu Survey Popup Image