ప్రభు పలుకులు నిరాశ నుండి మనలని విముక్తులను చేస్తాయన్న పోప్

14 డిసెంబర్ 2025 న ఖైదీల జూబిలీ దివ్యబలి పూజ అనంతరం, ఆగమన కాల మూడవ ఆదివారం రోజున పోప్ లియో విశ్వాసులకు తన సందేశాన్ని అందించారు. 

నిరీక్షణ,స్వేచ్ఛ మరియు ఆనందంపై పోప్ తన ఆలోచనలను పంచుకున్నారు. 

చెరసాలలో ఉన్నవారు కూడా సత్యాన్ని ప్రకటించగలరని, నిరీక్షణ జీవితానికి ఒక ఉదాహరణగా ఉండగలరని బాప్తిస్మా యోహాను సాక్ష్యాన్ని ప్రస్తావిస్తూ పోప్ మాట్లాడారు  

కారాగారం నుండే యోహాను, యేసు చేసిన కార్యాల గురించి వింటాడు. అయితే అవి తన అంచనాలకు పూర్తిగా సరిపోలనట్లు అనిపించడంతో, “రానున్నవాడు నీవేనా? లేక మరొకరిని ఎదురు చూడాలా?” అని ప్రశ్నించాడు. 

ఈ ప్రశ్న సత్యం మరియు న్యాయం కోసం తపించే వారందరిలో, స్వేచ్ఛ మరియు శాంతి ని కోరుకునే వారిలో ఇప్పటికీ మారుమోగుతూనే ఉందని పోప్ అన్నారు.

యోహాను సందేహానికి యేసు సిద్ధాంతాలతో సమాధానం ఇవ్వలేదు. తన కార్యాలనే చూపించాడు. క్రీస్తు తాను ఎవరో తన పనుల ద్వారా వెల్లడిస్తాడని పోప్ వివరించారు.

పేదలు, రోగులే ఆయనకు సాక్ష్యమిస్తారు. మెస్సయ్యా సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి—“అంధులు చూస్తారు, మూగవారు మాటలాడుతారు, చెవిటివారు వింటారు”.

యేసు మాటలు “మనలను నిరాశ మరియు బాధ అనే కారాగారంనుండి విముక్తి చేస్తాయి” అని పోప్ చెప్పారు. ప్రతి ప్రవచనం క్రీస్తులో నెరవేరుతుందని పోప్అన్నారు.