ECR ప్రతినిధి బృందంతో సమావేశమైన పోప్

వాటికన్ లో 11 డిసెంబర్ 2025న పాంటిఫికల్ Christian Archaeology ఇన్‌స్టిట్యూట్ స్థాపనకు 100 సంవత్సరాలు పూర్తైన సందర్భంలో, పాప్ లియో XIV ఆ సంస్థ విద్యార్థులు మరియు అధ్యాపకులను సాంస్కృతిక దౌత్యానికి తోడ్పడుతూ పాక్షికతలను తొలగించే వారిగా ఉండాలని పిలుపునిచ్చారు.

క్రైస్తవ పురాతన అవశేషాలపై శాస్త్రీయ అధ్యయనాలకు యువతను ప్రోత్సహించడానికి 1925లో పోప్ పియస్ XI ఈ సంస్థను స్థాపించారు.

ఈ సంస్థ యొక్క లక్ష్యం ఈ రోజుకీ సజీవంగా ఉందని, ముఖ్యంగా అంతర్జాతీయ సదస్సుల ద్వారా చారిత్రక పరిశోధనలను మరియు క్రైస్తవ విశ్వాస గుర్తింపును బలోపేతం చేస్తోందని పోప్అన్నారు.

సంస్కృతి ద్వారా దేశాల మధ్య వంతెనలు నిర్మించడానికి, పరస్పర కలయికలను ప్రోత్సహించడానికి, సామాన్య మంగళానికి సేవ చేయడానికి తమ పని ఉపయోగపడాలని పాప్ సభ్యులను ఆహ్వానించారు.

1925 లో ఈ సంస్థ స్థాపించినపుడు "శాంతి జూబిలీ"ని కొనియాడారు ఈ సంవత్సరం 2025“నిరీక్షణ జూబిలీ వరకు కూడా వీరు చేసే ప్రతి పనిలో  “శాంతి మరియు ఆశను  తీసుకువెళ్లేవారుగా” ఉండాలని పురావస్తు శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు

క్రైస్తవ పురావస్తు శాస్త్రం ఐక్యమత్యానికి విలువైన సాధనమని కూడా పోప్ అన్నారు.