ఆగమనకాల విశిష్టతను వివరించిన పోప్ లియో
సెయింట్ పీటర్స్ స్క్వేర్‌ను క్రీస్తు జనన దృశ్యంతో అలంకరించగా ప్రభుని రాకడను స్వాగతించడానికి సిద్ధపడే సమయంగా ఆగమన కాల విశిష్టతను పోప్ లియో గుర్తు చేశారు.
డిసెంబర్ 17న బుధవారం జరిగిన సామాన్య ప్రేక్షకుల సమావేశంలో వివిధ దేశాలకు నుండి వచ్చిన యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపారు
"దేవుని కుమారుడు, లోకరక్షకుడైన యేసు రాకకు సన్నాహకంగా మీలో ప్రతి ఒక్కరూ మరియు మీ కుటుంబాలు ఆశీర్వాదకరమైన ఆగమనాన్ని అనుభూతిచెందాలని నేను ప్రార్థిస్తున్నాను" అని పోప్ లియో విశ్వాసులతో అన్నారు.
మనం భౌతిక సంపదపై ద్రుష్టి పెట్టక ఆధ్యాత్మిక సత్యంలో, ప్రభువుపైన విశ్వాసం పొందడం నేర్చుకోవాలని విశ్వాసులను ఆహ్వానించారు.
నిజమైన సంతృప్తి సంపద సేకరణలో కాదుకానీ మానవ వికాసం మరియు సృష్టికి గౌరవం చూపే విలువలకు అనుగుణంగా జీవన నిర్ణయాలు తీసుకోవడంలో ఉంటుందని పోప్ గుర్తు చేశారు.