ఆఫ్రికా, స్పెయిన్ మరియు మొనాకోను సందర్శించనున్న పోప్
హోలీ సీ ప్రెస్ ఆఫీస్ పోప్ లియో రాబోయే అపోస్టోలిక్ పర్యటనను ఫిబ్రవరి 25 న ప్రకటించింది
ఏప్రిల్‌లో ఆఫ్రికాలో, అల్జీరియా, కామెరూన్, అంగోలా మరియు ఈక్వటోరియల్ గినియా మధ్య పది రోజులు;
మార్చి చివరిలో మొనాకో ప్రిన్సిపాలిటీలో ఒక రోజు;
మరియు జూన్‌లో స్పెయిన్‌లో, మాడ్రిడ్, బార్సిలోనా మరియు కానరీ దీవుల ద్వీపసమూహం మధ్య ఆరు రోజులు గడపనున్నారు.
వ్యక్తిగతంగా, నేను అల్జీరియా వెళ్లి సెయింట్ అగస్టీన్ జీవితంలోని ప్రదేశాలను సందర్శించాలని అనుకుంటున్నాను.
క్రైస్తవ మరియు ముస్లింల మధ్య వారధులను నిర్మించే సంభాషణపై ద్రుష్టి సారించాలని ఆశిస్తున్నాను.
ఆఫ్రికాను రెండవ జాన్ పాల్ పోప్ , పదహారవ బెనెడిక్ట్ పోప్ మరియు పోప్ ఫ్రాన్సిస్ కూడా సందర్శించారు.
చివరిసారిగా 2011లో పదహారవ బెనెడిక్ట్ పోప్ ప్రపంచ యువజన దినోత్సవం నాడు స్పెయిన్‌ను సందర్శించారు.
పోప్ ఫ్రాన్సిస్ స్పెయిన్‌కు ఒక పర్యటనను ప్లాన్ చేసుకున్నారు కానీ ఇప్పుడు పోప్ లియో దానిని అమలుచేయబోతున్నారు
హోలీ సీ ఇంకా దానిని ధృవీకరించలేదు, కానీ పోప్ లియో మాడ్రిడ్, బార్సిలోనా మరియు కానరీ దీవుల నగరాలను సందర్శించే అవకాశం ఉంది.