అమరవీరుల పిల్లలకు విశ్వాస ఆధారిత వేసవి శిబిరం
అమరవీరుల పిల్లలకు విశ్వాస ఆధారిత వేసవి శిబిరం
లైఫ్‌క్యాంప్ యూఎస్ఏ (LifeCampUSA)అనేది సైనిక సేవలో, పోలీసు విభాగంలో, లేదా ప్రథమ స్పందనదారులుగా తండ్రులను కోల్పోయిన పాఠశాల విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఒక వేసవి కార్యక్రమం.
ఈ వేసవి శిబిరంలో వారి మొదటి రోజున, సుమారు 12-18 ఏళ్ల వయస్సు గల పిల్లలకు మార్గ నిర్దేశం చేయడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం, దిశానిర్దేశం పెరుగుతాయి.
బైబిల్ ఆధారిత కథలు , దేవుని ప్రేమను వారికీ తెలియజేస్తారు. జీవితంలో దేవుని వాక్యం వారికీ దిక్సూచిగా ఎలా ఉపయోగపడుతుందనే దానిపై చర్చ జరుగుతుంది.
సైనిక సేవలో, ప్రథమ స్పందనదారులుగా, లేదా చట్ట అమలు విభాగంలో తమ తండ్రులను కోల్పోయిన అబ్బాయిలు మరియు అమ్మాయిలకు, లైఫ్‌క్యాంప్ యూఎస్ఏ మరియు దాని బైబిల్ ఆధారిత పాఠ్యప్రణాళిక ఒక జీవితాన్ని మార్చే వేసవి అనుభవంగా ఉంటుంది. దీని ద్వారా వారు కొత్త స్నేహాలను ఏర్పరచుకుని, దేవునితో మంచి సంబంధాన్ని పొందుతారు.
దంపతులైన మార్క్ మరియు జేన్ న్యూమాన్ ఈ శిభిరాన్ని స్థాపించారు. ఇది మత సంస్థతో సంబంధం లేని ఒక క్రైస్తవ పరిచర్య" . 2021 వేసవిలో మొదటిసారిగా ప్రారంభమైంది. సైనిక కుటుంబాలకు చెందిన కొంతమంది మాధ్యమిక పాఠశాల విద్యార్థులను న్యూమాన్ దంపతులు కలుసుకుని, వారి తండ్రులను కోల్పోయిన తర్వాత వారు ఎదుర్కొంటున్న కష్టాల గురించి విన్న తర్వాత ఇది మొదలైంది.
తమ దేవాలయం లోని యువత పరిచర్యలో పాఠశాల విద్యార్థులతో పనిచేసిన అనుభవం ఉండటంతో, ఈ పిల్లలకు సహాయం చేయాలని మరియు "తండ్రి లేని వారికి తండ్రులుగా మారాలని" న్యూమాన్ దంపతులు దైవ పిలుపును అందుకున్నారు.
లైఫ్‌క్యాంప్ యూఎస్ఏకు హాజరయ్యే పిల్లల పట్ల తమ ప్రధాన ఆశయం, "నిజం చెప్పాలంటే, వారిలో చాలా మంది చాలా నిరాశలో ఉన్నారు కాబట్టి వారికి ఆశ కల్పించడం" మరియు "వారి జీవిత గమనాన్ని మార్చడం" అని మార్క్ తెలిపారు.
లైఫ్‌క్యాంప్ యూఎస్ఏ తమ వేసవి శిబిర కార్యక్రమాన్ని యునైటెడ్ స్టేట్స్‌లోని కొలరాడో, మోంటానా, సౌత్ డకోటా, మిన్నెసోటా మరియు విస్కాన్సిన్‌తో సహా పలు విభిన్న రాష్ట్రాలలో అందిస్తుంది. శిబిరానికి హాజరయ్యే వారికి విమాన ప్రయాణ ఛార్జీలతో సహా అన్ని ఖర్చులను లైఫ్‌క్యాంప్‌యూఎస్‌ఏ పూర్తిగా భరిస్తుంది. అలాగే, శిబిరంలో ఒక వారం గడిపిన తర్వాత, శిబిరవాసులందరూ తమ మార్గదర్శకత్వాన్ని కొనసాగించడానికి లైఫ్‌కేర్ అనే 12 నెలల కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
Article and design by M Kranthi Swaroop