విశాఖ అతిమేత్రాసనం యర్ర సామంతవలస విచారణ, క్రీస్తురాజు పుణ్య క్షేత్రంలో " ఒక్క రోజు సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ ప్రార్థన" భక్తియుతంగా జరిగింది. ఆదివారం రాత్రి క్రీస్తు రాజు పురం లోని పనసబద్ర నూతన దేవాలయం లో రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు జరిగింది.
విశాఖ అతిమేత్రాసనం సెయింట్ ఆన్స్ కో కథెడ్రల్ విచారణ, పునీత అన్నమ్మగారి మహోత్సవ నవదిన ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. విచారణ కర్తలు గురుశ్రీ మరియారత్నం గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి.