విశాఖ అగ్రపీఠం, కోటనరవ విచారణలో పునీత మధర్ తెరేసా దేవాలయ మహోత్సవము ఘనంగా జరిగింది. విచారణ కర్తలు గురుశ్రీ రత్నకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
విశాఖ అతిమేత్రాసనం, ఎర్ర సామంతవలస గిరిజన విచారణలో జపమాల మాత పండుగ ఘనంగా జరిగింది. విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు, ఎర్ర సామంతవలస విచారణ కర్తలు గురుశ్రీ జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యాక్రమం జరిగింది.
విశాఖపురి మేరిమాత పుణ్యక్షేత్రం, కొండగుడిలో జపమాల రాజ్ఞీ మహోత్సవము భక్తియుతంగా జరిగింది. జపమాల రాజ్ఞీ మహోత్సవము మరియు ఫాతిమామాత దర్శనములకు 107 ఏండ్లు (1917-2024) నిండిన శుభతరుణాన ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
విశాఖ అతిమేత్రాసనం, మధురవాడ విచారణలో గల పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి దేవాలయంలో పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి మహోత్సవము ఘనంగా జరిగింది. విచారణ గురువులు గురుశ్రీ ప్రకాష్ (TOR) గారి ఆధ్వర్యంలో ఈ మహోత్సవము ఆద్యంతం కన్నుల పండుగగా జరిగింది.
హైదరాబాద్ అతిమేత్రాసనం, వనస్థలిపురం విచారణ పరిశుద్ధ సిలువ దేవాలయంలో పరిశుద్ధ సిలువ విజయ మహోత్సవ పండుగ ఘనంగా జరిగింది. విచారణకర్తలు గురుశ్రీ పులి అశోక్ కుమార్ , HGN గారి ఆధ్వర్యంలో జరిగాయి.
విశాఖ అతిమేత్రాసనం, ఉత్తరాంధ్రలో ప్రకృతి సోయగాల నడుమ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న కొత్తవలస మండలం కొండడాబా వ్యాకులమాత మహోత్సవం ఘనంగా జరిగింది. గురుశ్రీ గొంగాడ రాజు గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
కడప మేత్రాసనం, ఆరోగ్యమాత పుణ్య క్షేత్రంలో 8 సెప్టెంబర్ 2024 న ఆరోగ్యమాత మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలు పుణ్యక్షేత్రం డైరెక్టర్ గురుశ్రీ MD ప్రసాద్ గారి అద్వర్యంలో జరిగాయి.
విశాఖ అతిమేత్రాసనం సెయింట్ ఆన్స్ కో కథెడ్రల్ విచారణ, పునీత అన్నమ్మగారి మహోత్సవ నవదిన ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. విచారణ కర్తలు గురుశ్రీ మరియారత్నం గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి.
విశాఖ అతిమేత్రాసనంలో ప్రసిద్ధి గాంచిన "కోడూరుమాత మహోత్సవం" ప్రతి ఏటా సెప్టెంబర్ రెండవ శనివారం జరుగుతుంది. వివిధ ప్రాంతాలనుండి అధిక సంఖ్యలో భక్తులు కోడూరుమాత ను దర్శించుకుంటారు.ఈ సంవత్సరం సెప్టెంబరు 14 వ తేది కోడూరుమాత మహోత్సవం జరగనున్నది.
ఫ్రాన్సిస్ పాపు గారు ఫిబ్రవరి 27, 2024న కర్నూలు మేత్రాసనానికి నూతన పీఠాధిపతులుగా OCD సభకు చెందిన గురుశ్రీ గోరంట్ల జ్వాన్నేసు గారిని నియమిస్తూ ప్రకటించారని తెలియచేయుటకు సంతోషిస్తున్నాం.