భక్తియుతంగా జపమాల రాజ్ఞీ మహోత్సవము
భక్తియుతంగా జపమాల రాజ్ఞీ మహోత్సవము
విశాఖపురి మేరిమాత పుణ్యక్షేత్రం, కొండగుడిలో జపమాల రాజ్ఞీ మహోత్సవము భక్తియుతంగా జరిగింది. జపమాల రాజ్ఞీ మహోత్సవము మరియు ఫాతిమామాత దర్శనములకు 107 ఏండ్లు (1917-2024) నిండిన శుభతరుణాన ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పుణ్యక్షేత్ర డైరెక్టర్ గురుశ్రీ కొండల జోసఫ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది .
సోమవారం ఉ॥ 9.30 నుండి సా॥ 3.30 గం॥ల వరకు జరిగీన ఈ కార్యక్రమంలో పరిశుద్ధ జపమాల, దైవ వాక్యపరిచర్య, దివ్యసత్ప్రసాద ఆరాధన, పాపసంకీర్తనములు నిర్వహించారు. కొండమీద ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫాతిమామాత స్వరూపంతో ప్రదక్షిణ భక్తియుతంగా సాగింది.
పిఠాపురం విచారణ గురువులు గురుశ్రీ కండి కిరణ్ MSFS గారు పాల్గొని అమూల్యమైన దైవ సందేశాన్ని ప్రజలకు అందించారు. ప్రధానార్చకులు గా గురుశ్రీ మల్లెల జోజి, MSFS గారు పాల్గొని ఇతర గురువులతో కలసి దివ్య బలిపూజను సమర్పించారు .
పిఠాపురం, ఎస్.ఎఫ్.ఎస్. గాయకబృందం వారు మధురమైన గీతాలను ఆలపించారు .
పండుగకు సహకరించిన ప్రతి ఒక్కరికి గురుశ్రీ కొండల జోసెఫ్ గారు కృతజ్ఞతలు తెలియజేసారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer