మీ సేవకుల పట్ల సున్నితంగా ఉండండి - కార్డినల్ ఫిలిప్ నెరి ఫెర్రో
మీ సేవకుల పట్ల సున్నితంగా ఉండండి - కార్డినల్ ఫిలిప్ నెరి ఫెర్రో
మీ సేవకుల పట్ల సున్నితంగా ఉండండి, ఎందుకంటే యేసు తన శిష్యుల పట్ల చాలా మృదువుగా ప్రవర్తించాడు" అని కాన్ఫరెన్స్ ఆఫ్ కాథలిక్ బిషప్స్ ఆఫ్ ఇండియా (CCBI) ప్రెసిడెంట్ మహా పూజ్య ఫెలిప్ నెరి కార్డినల్ ఫెర్రో అన్నారు.
గోవాలోని శాంతి సదన్, CCBI సెక్రటేరియట్ లో సెప్టెంబర్ 25 న "ప్రొపెడ్యూటిక్ ఫార్మేషన్లో సైకో-స్పిరిచువల్ ఇంటిగ్రేషన్" అనే కార్యక్రమం మొదలైనది. ఇది సెప్టెంబర్ 30 న ముగుస్తుంది.
గోవా మరియు డామన్ ఆర్చ్ బిషప్ మహా పూజ్య కార్డినల్ ఫిలిప్ నెరి ఫెర్రో గారు విశ్వాసులు సినోడ్ లో పాల్గొనడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ప్రజలకు తోడుగా ఉండటం, నిబద్ధత మరియు మతసంబంధమైన సున్నితత్వం వంటి సెమినరీ నిర్మాణం యొక్క సమగ్ర అంశాలను నొక్కి చెప్పారు.
ఈ కార్యక్రమానికి 14 ప్రాంతీయ మేత్రాసనాల ప్రొపెడ్యూటిక్ ఫార్మేషన్ హౌస్‌ల నుండి 16 మంది పాల్గొంటున్నారు మరియు ఆంద్రా ప్రావిన్స్‌కు చెందిన జెస్యూట్ ఫాదర్ గురుశ్రీ జయరాజ్ ఈ కోర్సుకు రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించారు.గోవాలోని మేజర్ సెమినరీ మాజీ రెక్టార్ డాక్టర్ అలీక్సో మెనెజెస్ గారు ఈ కోర్సును ప్రారంభించారు.
వివిధ ప్రొపెడ్యూటిక్ ఫార్మేషన్ హౌస్‌లలో ఉత్తమ అభ్యాసాల భాగస్వామ్యం భవిష్యత్ ప్రణాళిక కోసం కొత్త దిశలను ఏర్పరచుకోవడంలో పాల్గొనేవారికి సహాయపడుతుంది. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 30న పాత గోవాకు యాత్రతో ముగుస్తుంది.