బాలుర కారాగారాన్ని సందర్శించిన వైజాగ్ PMI సభ్యులు

బాలుర కారాగారాన్ని సందర్శించిన వైజాగ్ PMI సభ్యులు
విశాఖ అతిమేత్రాసనం, విశాఖపట్నంలోని ఆరిలోవలోని బాలుర కారాగారాన్ని వైజాగ్ భారత చెరసాల పరిచర్య(PMI) సభ్యులు సందర్శించారు. PMI కోఆర్డినేటర్ ఫాదర్ ప్రదీప్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఎన్నో ఏళ్లుగా నిస్వార్థమైన సేవ చేస్తూ ఖైదీలలో మార్పు కొరకు పాటుపడుతూ, వారికొరకు ప్రార్థిస్తున్నా విశాఖపట్నం PMI(భారత చెరసాల పరిచర్య ) సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిలో సిస్టర్ మేరీ జేమ్స్ , నిర్మల మేరీ , విజయ లూర్దు గార్లు పాల్గొని తమ సహాయ సహకారాలను అందించారు.
బాలురలలో పశ్చత్తాప భావాన్ని నింపుతూ ప్రభు యేసుని ప్రేమను వారికీ తెలియజేసారు. వారితో ప్రేమగా మాటాడుతూ మేమున్నాము అనే ధైర్యాన్ని వారికీ ఇచ్చారు. ఫాదర్ ప్రదీప్ గారు వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసారు.
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer