మధ్యప్రాచ్య కాల్పుల విరమణను స్వాగతిన లియో పాపు గారు

మధ్యప్రాచ్య కాల్పుల విరమణను స్వాగతిన లియో పాపు గారు 

మధ్యప్రాచ్యంలో కాల్పుల విరమణ వార్తను పరిశుద్ధ  లియో పాపు గారు స్వాగతించారు. ఈ  సంఘర్షణకు ముగింపు పలకడానికి అన్ని పక్షాలు సుదీర్ఘ చర్చలలో పాల్గొనాలని కోరారు. ఏప్రిల్ 11వ తేదీ శనివారం నాడు శాంతి కోసం చేసే ప్రార్థనలో తనతో చేరాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసులను అయన కోరారు. 

సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో సమావేశమైన విశ్వాసులను ఉద్దేశించి పరిశుద్ధ  లియో పాపు గారు ప్రసంగించారు.   "శాంతి చర్చల ద్వారానే   మనం యుద్ధాన్ని ముగించగలము" అని లియో పాపు గారు నొక్కి చెప్పారు.

ఏప్రిల్ 11న సెయింట్ పీటర్స్ బసిలికాలో శాంతి కోసం ఒక ప్రార్థనా జాగరణ జరుగుతుందని, మరియు వ్యక్తిగతంగా హాజరయ్యేవారైనా లేదా ఇంటి నుండి అనుసరించేవారైనా ప్రతిఒక్కరూ ఇందులో చేరవచ్చని పరిశుద్ధ  లియో పాపు గారు తెలియజేసారు. ఈ జాగరణ రోమ్ కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది. 

Article and Design By M Kranthi Swaroop