బ్రదర్ జోసఫ్ తంబి గారి వేడుకలు ప్రారంభం
విజయవాడ మేత్రాసనం, ఉంగుటూరు మండలం, పెద అవుటపల్లి లో బ్రదర్ జోసఫ్ తంబి గారి 79వ వర్ధంతి వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 4వ తేదీ నుండి జరుగుతున్న నవదిన ప్రార్ధనలు 12 శుక్రవారం రాత్రితో ముగిసాయి.
కడప మేత్రాసనం, కమాలాపురం విచారణ గురువులు గురుశ్రీ బుడ్డాయపల్లి సతీష్ది గారు దివ్యబలి పూజను సమర్పించారు , “క్రీస్తును అనుసరించడములో తంబి గారి సుమాతృక”ను గురించి ప్రసంగించారు.
దైవసేవకుడు బ్రదర్ జోసఫ్ తంబి అందరికి దగ్గరయ్యాడంటే దానికి ముఖ్యకారణం ఆయన క్రీస్తును సంపూర్ణముగా అనుసరించాడఅన్నారు. క్రీస్తును అనుసరించడం అంటే ఆయన బోధనలను, సువార్తా విలువలను అనుదిన జీవితములో పాటించడం మరియు క్రీస్తుకు సాక్ష్యమివ్వడమన్నారు.
పూజానంతరం పుణ్యక్షేత్ర రెక్టర్ గురుశ్రీ పాలడుగు జోసఫ్ గారు మాట్లాడుతూ నేటితో నవదిన ప్రార్ధనలు ముగిసాయని 13, 14, 15 వ తేదీలలో బ్రదర్ జోసఫ్ త్రిదిన ఉత్సవాలలోకి ప్రవేశిస్తామన్నారు. అందుకు సర్వం సిద్ధమైనదని, వచ్చే భక్తులకు, విశ్వాసులకు, యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, తంబి గారి సమాధిని, గృహాన్ని, దేవాలయాన్ని సందర్శించుకొని, ప్రార్ధనలు చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు.
15 న ఉదయం 7 గంటలకు విజయవాడ మేత్రానులు మహా పూజ్య తెలగతోటి జోసఫ్ రాజరావు గారిచే సమిష్టి దివ్యబలి పూజ అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు.