నైజీరియాలో క్రైస్తవ హింస అంతం అవ్వాలని ప్రార్దించిన పోప్

ఆఫ్రికన్ దేశంలోని వివిధ వర్గాలపై ఉగ్రవాద దాడులు అనేక మందిని బలిగొన్నాయని నైజీరియాలో పరిస్థితిని పోప్ లియో ఫిబ్రవరి 8 న తన త్రికాల ప్రార్ధన సమయంలో గుర్తుచేసుకున్నారు. 

హింస మరియు ఉగ్రవాద బాధితులందరికీ ప్రార్థనలో నా సాన్నిహిత్యాన్ని తెలియజేస్తున్నాను అని పోప్ అన్నారు .

కడునా రాష్ట్రంలోని ఒక పట్టణంపై సాయుధ బృందం దాడి చేసింది, దీని వలన అనేక మంది గాయపడ్డారు, కిడ్నాప్ చేయబడ్డారు మరియు మరణించారు.

అపహరణకు గురైన వారిలో Karku పట్టణంలోని హోలీ ట్రినిటీ విచారణకు చెందిన గురువు  ఫాదర్ Nathaniel Asuwaye కూడా ఉన్నట్లు తెలిసింది, దీనిని వారి సొంత మేత్రాసనం ధృవీకరించారు.

భారీ వర్షం మరియు బలమైన గాలులతో తీవ్రమైన తుఫానుల కారణంగా యూరప్ అంతటా ఉన్న అన్ని ప్రాంతాల కోసం ప్రార్థనలు చేయాలని పోప్ పిలుపునిచ్చారు.

వరదలు మరియు కొండచరియల విరిగిపడడం వల్ల Portugal, Morocco మరియు Spain జనాభా - ముఖ్యంగా Andalusia లోని Grazalema- అలాగే దక్షిణ ఇటలీ - ముఖ్యంగా సిసిలీలోని Niscemi- కొరకు నేను ప్రార్థిస్తున్నాను అని పోప్ అన్నారు