ఘనంగా "క్రీస్తు పరమ పవిత్ర శరీర రక్తముల" మహోత్సవం

 

ఘనంగా "క్రీస్తు పరమ పవిత్ర శరీర రక్తముల" మహోత్సవం

విశాఖ అతిమేత్రాసనం, కైలాసపురం విచారణ వేళంగాణిమాత  దేవాలయం లో "క్రీస్తు పరమ పవిత్ర శరీర రక్తముల" మహోత్సవం ఘనంగా జరిగింది. విచారణ కర్తలు, ఆధ్యాత్మిక గురువులు    గురుశ్రీ సంతోష్ CMF, గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

అధికసంఖ్యలో విశ్వాసులు భక్తి శ్రద్ధలతో పండుగ దివ్య బలిపూజలో పాల్గొన్నారు.
దివ్యపూజబలిని గురుశ్రీ సంతోష్ CMF  మరియు  గురుశ్రీ జాన్ వట్టికనాల్ CMF లు సమర్పించారు. విచారణ గాయక బృదం మధురమైన గీతాలను ఆలపించారు.

ముఖ్యంగా ఈ దివ్యబలిపూజలో 41 మంది చిన్నారులు నూతంగా  దివ్యసత్ప్రసాదం స్వీకరించారు. గురుశ్రీ సంతోష్ గారు మాట్లాడుతూ చిన్నారులకు ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించిన టీచర్స్ ను కొనియాడారు.

ఆద్యంతం కన్నులపండుగగా ఈ కార్యక్రమం జరిగింది.గురుశ్రీ సంతోష్ గారు పండుగకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer

 

Telugu Survey Popup Image