కొలంబియా భూకంప బాధితుల కోసం లాటిన్ అమెరికా బిషప్‌ల ప్రార్థనలు
కొలంబియా భూకంప బాధితులకు లాటిన్ అమెరికా బిషప్‌ల సంఘీభావం
ఆగస్టు 10న కొలంబియాను తీవ్రంగా కుదిపేసిన భూకంపం నేపథ్యంలో, లాటిన్ అమెరికాలోని పలు దేశాల పీఠాధిపతులు (బిషప్) కొలంబియా ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తూ, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేసి, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు.
కొలంబియన్ బిషప్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు అగ్రపీఠాధిపతులు ఫ్రాన్సిస్కో జేవియర్ మునెరాకు పంపిన లేఖలో అర్జెంటీనా బిషప్‌లు, “బాధితులు మరియు వారి కుటుంబాల వేదనలో మేము కూడా పాలుపంచుకుంటున్నాము. ఈ క్లిష్ట సమయంలో భూకంపం ప్రభావానికి గురైన అన్ని వర్గాల ప్రజలకు మా ప్రార్థనల ద్వారా తోడుగా ఉంటాము” అని తెలిపారు.
“బాధపడుతున్న వారికి ఓదార్పును, తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి బలాన్ని, ఈ విషాద పరిణామాలను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికీ ధైర్యాన్ని ప్రసాదించమని ప్రభువును ప్రార్థిస్తున్నాము” అని అర్జెంటీనా బిషప్‌లు పేర్కొన్నారు.
పెరూ బిషప్‌లు కూడా “ప్రియమైన కొలంబియా ప్రజలకు, కొలంబియాలోని విశ్వాసులకు కి మా హృదయపూర్వక సాన్నిహిత్యాన్ని, సంఘీభావాన్ని తెలియజేస్తున్నాము” అని పేర్కొన్నారు.
ఆగస్టు 10న కొలంబియాలోని పలు జిల్లాలను తాకిన 7.4 తీవ్రత గల భూకంపం కారణంగా కనీసం 140 మంది మరణించారు. ఆగస్టు 11న విడుదల చేసిన ఒక తాజా సమాచారంలో, అధ్యక్షుడు అబెలార్డో డి లా ఎస్ప్రిల్లా మాట్లాడుతూ, దాదాపు 2,600 మంది గాయపడ్డారని, దాదాపు 200 మంది గల్లంతయ్యారని, 1,100కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని, మరియు 8,000కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని చెప్పినట్లు బీబీసీ నివేదించింది .
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:34 గంటలకు, పసిఫిక్ తీరంలోని చోకో డిపార్ట్‌మెంట్‌లోని శాన్ జోస్ డెల్ పాల్మార్ పట్టణంలో సుమారు 60 మైళ్ల లోతులో ఈ భూకంపం సంభవించింది.
Article and Design By M Kranthi Swaroop
