ప్రగాఢ విశ్వాసంతో దివ్యసంస్కారాలు స్వీకరించిన దొరకొట్టాల గ్రామ బాలబాలికలు
మార్చి 15 ,2026 కర్నూలు మేత్రాసనము, ఆళ్లగడ్డ విచారణ, దొరకొట్టాల గ్రామ బాలబాలికలు పవిత్ర దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించారు.
కర్నూలు మేత్రానలు మహా ఘన గోరంట్ల జ్వాన్నెస్ గారికి గ్రామ ముఖ ద్వారం నుంచి సంఘ పెద్దలు, విశ్వాసులు, యువత,స్త్రీపురుషులు మేళతాళాలతో స్వాగతం పలికారు.
అనంతరం ఫాదర్ హన్ రాడ్స్ గారి విగ్రహానికి పూలమాల వేసి,ఆయన సమాధిని దర్శించి ప్రార్థనలు చేశారు.
పీఠాధిపతులతో పాటు,విచారణ గురువు శౌరి రెడ్డి గారు విశ్వాసుల కొరకు దివ్యబలి పూజ సమర్పించారు, 15 మంది పిల్లలు దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించారు
పూజ అనంతరం సంఘ పెద్దలు శాంతయ్య శౌవరయ్య, రాయల్ అంతోని మరియు ఉపదేశి మరియమ్మ విచారణ గురువు ఫాదర్ శౌరిరెడ్డి గారు మరియు ప్రజలు పీఠాధిపతులను శాలువాలతో పూలమాలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మేత్రాసన ఆనిమేటర్సు మరియు ఆళ్లగడ్డ సిస్టర్స్ వివిధ గ్రామాల నుండి ప్రజలు, గ్రామ పెద్దలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.
వచ్చిన అతిథులకు గ్రామంలో ఉన్న వారికి గ్రామ క్రైస్తవ సంఘం భోజనములో ఏర్పాటు చేయడం జరిగింది