ప్రపంచ పేదల దినోత్సవంపై మాట్లాడిన పోప్ లియో
2026 నవంబర్ 15న జరగనున్న 10వ ప్రపంచ పేదల దినోత్సవానికి ముందు, తరచుగా వినబడని స్వరాలను ఆలకించాలని పోప్ లియో కోరారు
పేదల రక్షకుడు మరియు వారి సంరక్షక పునీతుడైన పునీత అంతోని వారి పండుగ రోజున ఆయన ఈ సందేశాన్ని విడుదల చేశారు.
పేదరికం మరియు వివక్ష యొక్క వాస్తవ పరిస్థితులపై దృష్టిని ఆకర్షించడానికి పోప్ ఫ్రాన్సిస్ 2016లో ప్రపంచ పేదల దినోత్సవాన్ని ప్రారంభించారు.
“ప్రభువే పేదల ఆశ్రయం” అనే ఇతివృత్తంపై, పోప్ మాట్లాడుతూ సామాజిక అన్యాయం, ఇతరుల కంటే తమను తాము గొప్పగా భావించేలా చేసే మనస్తత్వం మంచిది కాదు అని అన్నారు
అహంకారపూరిత అవినీతి నుండి తలెత్తుతున్న విస్తృతమైన సామాజిక అన్యాయం నేటికీ ఉందని, మనం చూస్తున్నాము, ఇది వివక్షాపూరితమైనది మరియు అంతే నిందార్హమైనది.
పోప్ మొదటి ఎన్సైక్లికల్ 'మాగ్నిఫికా హ్యూమనిటాస్'లో, తాను 'పేదల సద్గుణం' అనే దాని గురించి కూడా విశ్లేషించారు.
సాంకేతికత కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కావడం, సమాజంలోని అత్యంత బలహీనమైన మరియు అట్టడుగున ఉన్న ప్రజల నుండి దృష్టిని మళ్లిస్తుందని పోప్ అన్నారు
డిజిటల్ ప్రపంచం తరచుగా పేదరికంలో జీవిస్తున్న వారికి వ్యతిరేకంగా పనిచేస్తుందని పోప్ లియో అన్నారు
సామాజిక మరియు డిజిటల్ నిర్మాణాలను విమర్శిస్తూ, పేదరికాన్ని మరింత పెంచే శక్తులకు వ్యతిరేకంగా మాట్లాడటానికి పోప్ లియో 10వ ప్రపంచ పేదల దినోత్సవాన్ని ఉపయోగించుకుంటున్నారు.
ఆశ్రయం, గౌరవం మరియు పరివర్తనకు నిలయంగా ఉండాలనేది శ్రీసభ కర్తవ్యం అని కూడా పోప్ పునరుద్ఘాటించారు.